Home » Bro: “బ్రో” తో ఇంత జరిగినా తగ్గేదేలే.. “ఉస్తాద్” లో కూడా పవన్ పొలిటికల్ పంచ్ ఉండబోతోందా?

Bro: “బ్రో” తో ఇంత జరిగినా తగ్గేదేలే.. “ఉస్తాద్” లో కూడా పవన్ పొలిటికల్ పంచ్ ఉండబోతోందా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీ సార్టర్లుగా తెరకెక్కిన బ్రో చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. తమిళ సినిమా వినోదయ సీతంకు రీమేక్ గా వచ్చిన బ్రో చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో సముద్రఖనియే దర్శకత్వం వహించారు. కాగా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా రూపొందించారు. కేవలం 21 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Advertisement

అయితే.. ఈ సినిమా విడుదల అయ్యాక మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాలో ఒక సాంగ్ అంబటి రాంబాబు ని ఇమిటేట్ చేస్తూ తీసారని బయట టాక్ నడుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది. పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్రో సినిమాలో ఒక చిన్న పొలిటికల్ సెటైర్ కె ఇంత రచ్చ జరుగుతోంది. మరో వైపు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న “ఉత్సాద్ భగత్ సింగ్” లో కూడా పవన్ గట్టిగానే పొలిటికల్ పంచ్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

Advertisement

గతంలో రెండేళ్ల క్రితమే ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇవ్వగా.. షూటింగ్ జరగలేదు. ప్రస్తుతం పేరు మార్చి తిరిగి షూటింగ్ మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా ఒక షెడ్యూల్ షూటింగ్ ని మాత్రమే ఈ సినిమా పూర్తి చేసుకుంది. క్రేజీ గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవుతుండడంతో పవన్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ హరీష్ కి చెప్పి మరీ పొలిటికల్ పంచ్ లు రాయించినట్లు తెలుస్తోంది. ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పవన్ ఈ సినిమా షూటింగ్ త్వరగానే కంప్లీట్ చేసుకుని 2024 పొంగల్ రేస్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవన్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరిన్ని..

Yawning : అదేపనిగా ఆవలింతలు రావడం అనారోగ్యానికి సంకేతమా..! నిపుణులు ఏమంటున్నారంటే..?

షారుఖ్ సినిమాలో సౌత్ స్టార్ హీరో.. జవాన్ ట్రైలర్‏తో సస్పెన్స్..!

సింహాద్రి మూవీ హీరోయిన్ అంకిత ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా ?

Visitors Are Also Reading