Home » NTR: ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందంటే?

NTR: ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడమే చాలా కష్టం. ఒకవేళ అవకాశాలు వచ్చినా వాటిని నిలబెట్టుకుని ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా కొనసాగడం కూడా కష్టమే. అయితే అవకాశాలు వచ్చిన కొత్తల్లో బాగా పాపులర్ అయ్యి.. ఆ తరువాత తెరమరుగున పడిపోయే నటులు చాలా మందే ఉంటారు. వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. అల్లరి నరేష్ నటించిన సిద్దూ ఫ్రేం శ్రీకాకుళం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి మంజరి ఫెడ్నెస్. ఈమె ఎన్టీఆర్ శక్తీ సినిమాలో కూడా నటించారు.

Advertisement

ఎన్టీఆర్ పక్కన నటించిన మంజరి, అల్లరి నరేష్ తో శుభప్రదం సినిమాలో హీరోయిన్ గా కూడా నటించారు. అయితే అవకాశాలు రాకపోవడంతో ఈమె సినిమాలలో కనిపించడం లేదు. అయితే.. పక్కింటమ్మాయిలా అందంగా క్యూట్ గా కనిపించే మంజరికి తెలుగు నాట చాలా మంది ఫాన్స్ ఉన్నారు. శుభప్రదం సినిమా తరువాత మంజరి శక్తీ సినిమాలో కనిపించింది. మెహర్ రమేష్ రూపొందించిన ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. కానీ, ఫ్లాష్ బ్యాక్ సీన్లలో ఎన్టీఆర్ భార్యగా కనిపించిన మంజరి తన నటనతో అలరించింది. తెలుగు సినిమాలలో ఆమె హవా తగ్గినప్పటికీ బాలీవుడ్లో ఆమెకు బాగానే అవకాశాలు వస్తున్నాయి.

Advertisement

మరాఠి , హిందీ సినిమాలతో కూడా మంజరి బిజీ అయిపొయింది. హిందీ లో సినిమాలలోనే కాకుండా.. వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మంజరి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆమె సోషల్ మీడియా అకౌంట్లలో లేటెస్ట్ గా కనిపిస్తున్న ఫోటోలు చుస్తే మతి పోతుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి మరి.

మరిన్ని..

“బోళా శంకర్” సినిమా అట్టర్ ఫ్లాప్… సుస్మిత పై ఫ్యాన్స్ సీరియస్ ?

అక్కినేని నాగార్జునకు రైతు బంధు…ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు

భోళా శంకర్ అట్టర్ ఫ్లాఫ్.. భారత్‌దే వరల్డ్ కప్.. ఇదే సెంటిమెంట్..!

Visitors Are Also Reading