Home » భయంతో బాహుబలి ఆపేయాలనుకున్న రాజమౌళి..!

భయంతో బాహుబలి ఆపేయాలనుకున్న రాజమౌళి..!

by Azhar
Ad
దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకు ఒక్క ప్లాప్ సినిమా అనేది తీయలేదు. అయితే ఆయన ఎన్ని సినిమాలు అనేవి తీసిన అందులో బాహుబలి అనే సినిమా చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఈరోజు టాలీవుడ్ మొత్తం ఇండియా సినిమాను ఏలుతుంది అంటే దానికి కారణం రాజమౌళి.. బాహుబలి అనే సినిమాతో పాన్ ఇండియా అనే కొత్త పదం అందహరికి పరిచయం చేయడం అనే చెప్పాలి.
అయితే ఈ బాహుబలి సినిమాతో డైరెక్టర్ గా రాజమౌళి అలాగే హీరోగా ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు అనే వచ్చిన విషయం తెలిసిందే. తనను ఈ రేంజ్ లో నిలబెట్టిన బాహుబలి సినిమాను భయంతో రాజమౌళి ఆపేయాలి అనుకున్నట్లు తాజాగా ఈ సినిమా నిర్మాత.. శోభూ యార్లగడ్డ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మర్యాదరామన్న తర్వాత బాహుబలి సినిమా చేయాలనీ నేను, రాజమౌళి అనుకున్నాము. అయితే ఈ సినిమా బడ్జెట్ అనేది మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యింది.
షూటింగ్ జరుగుతున్న కొద్దీ బడ్జెట్ అనేది పెరుగుతూనే ఉంది. దంతో రాజమౌళి ఓ సారి మధ్యలో.. ఈ సినిమాను ఆపేద్దాం. మనం ఇంకో సినిమాను చేద్దాం అని చెప్పారు. అయితే అలా సినిమాను మధ్యలో ఆపేద్దాం అనడంతో నాలో ఎలాగైనా ఈ సినిమాను పూర్తి చేయాలి అనే కసి పెరిగింది. దాంతో ధైర్యం చేసి బాహుబలి సినిమాను పూర్తి చేసాం. ఆరోజు మేము చేసిన రిస్క్ ఈరోజు ఇలా నిలబెట్టింది అని శోభూ యార్లగడ్డ తెలిపారు.

Advertisement

Visitors Are Also Reading