బాలీవుడ్ నుంచి వస్తున్న బడా మూవీస్ లో బ్రహ్మాస్త్ర ఒకటి. పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా.. అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచానాలు భారీగానే ఉన్నాయి. అక్కినేని నాగార్జున, మౌనిరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా లెవల్‌లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తునన ఈ సినిమాని తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో 2022 సెప్టెంబర్ 09న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Advertisement
హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నాం. దాని కోసం బాగా ఏర్పాటు చేశాం. కానీ అది కుదరలేదు. కరణ్ జోహార్ వినాయకుడి పూజ సరిగ్గా చేసి ఉండరు అందుకే ప్రోగ్రాం జరుగలేదని నవ్వుతూ రాజమౌళి పేర్కొన్నారు. ఓవైపు గణేష్ నిమజ్జనం ఉండడంతో పోలీసుల బందోబస్త్ కల్పించలేకపోయామన్నారు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేకపోయామన్నారు రాజమౌళి. బ్రహ్మాస్త్రంలో రణ్‌భీర్ కపూర్ మంటను తన చేతి నుంచి విసిరే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాడు. దీనిని ట్రైలర్‌లో చూశాం.
Advertisement
ఇది కూడా చదవండి : హిందూవ్యతిరేకి అంటూ రష్మి పై నెటిజెన్ దారుణమైన కామెంట్..దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన బ్యూటీ..!
దానిని లైవ్‌లో చూపించాలని భారీగా ప్లాన్ చేశాం కానీ భారీగా ఫైర్ వర్క్స్‌ని ప్లాన్ చేశాం. కానీ కుదరలేదు. అదేవిధంగా తొడగొట్టు చిన్నా అని రణభీర్ కపూర్ అడుగుతాడు. అప్పుడు ఎన్టీఆర్ తొడగొడితే ఫైర్ వచ్చేలా ప్లాన్ చేశాం. కానీ కుదరలేదు. దానిని బ్రహ్మాస్త్ర సక్సెస్ మీట్‌లో చేసి చూపిస్తామన్నారు. మేం మా చిన్నతనంలో వెదురు కర్రలతో బాణాలు చేసుకొని వాటిపై బ్రహ్మాస్త్రం, నాగాస్త్రం, ఆగ్రేయాస్త్రం, వరుణాస్త్రం, విష్ణాస్త్రం, అంటూ రాసుకుని ఆడకునే వాళ్లం. మాతో పాటు చాలా మంది ఆడుకునే వాళ్లు. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్రం కథ చెప్పినప్పుడు నా చిన్ననాటి ఫాంటసీ విషయాలన్నీ గుర్తుకొస్తాయన్నారు. ఇలాంటి ఓ మంచి సినిమాకు సపోర్ట్ చేయాలని అనుకున్నాను.. చేస్తున్నానని చెప్పుకొచ్చారు జక్కన్న.
ఇది కూడా చదవండి : పవన్ బర్త్ డే కు మంచు విష్ణు మనోజ్ స్పెషల్ విషెస్..కానీ విష్ణు అలా చేశాడేంటి..?