Home » ప‌వ‌న్ బ‌ర్త్ డే కు మంచు విష్ణు మ‌నోజ్ స్పెష‌ల్ విషెస్..కానీ విష్ణు అలా చేశాడేంటి..?

ప‌వ‌న్ బ‌ర్త్ డే కు మంచు విష్ణు మ‌నోజ్ స్పెష‌ల్ విషెస్..కానీ విష్ణు అలా చేశాడేంటి..?

by AJAY

ప‌వ‌ర్ స్టార్ వ‌ప‌న్ క‌ల్యాణ్ ఈరోజు పుట్టినరోజును జ‌రుపుకుంటున్నారు. ఈ సంధ‌ర్బంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాలో సెలబ్రెటీలు, అభిమానులు పెద్ద ఎత్తున పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ప‌లువురు స్టార్స్ ప‌వ‌న్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. అంతే కాకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా జ‌ల్సా ను నేడు విడుద‌ల చేశారు. కాగా థియేట‌ర్ ల‌లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది.

అభిమానులు ఈ సినిమా చూసేందుకు బారులు తీరుతున్నారు. ఓ థియేట‌ర్ లో అభిమానులు చేసిన సందడికి థియేట‌ర్ పాడైపోయింది. అంతే కాకుండా ఓ క‌పుల్ థియేట‌ర్ పైకి ఎక్కి డ్యాన్స్ లు చేయ‌గా దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఇదిలా ఉండ‌గా మెగాఫ్యామిలీకి మంచు ఫ్యామిలీ మా ఎన్నిక‌ల స‌మ‌యంలో గొడ‌వ‌లు వ‌చ్చాయ‌ని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా మంచు విష్ణు నాగ‌బాబు, చిరంజీవిల‌పై ఆరోప‌ణ‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా నేడు ప‌వ‌న్ పుట్టిన రోజున మంచు మ‌నోజ్, మంచు ల‌క్ష్మి చేసిన ట్వీట్లు వైరల్ గా మారాయి.

మంచు మ‌నోజ్ డియ‌రెస్ట్ అన్న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంటూ ఇంగ్లీష్ లో ట్వీట్ చేశారు. అంతే కాకుండా మంచు ల‌క్ష్మి కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు మీరు ఆరోగ్యంగా ఉండాలి మీ కోరిక‌లు నెర‌వేరాలి అంటూ సుధీర్గ‌మైన ట్వీట్ చేశారు. అయితే మంచు విష్ణు మాత్రం జ‌న‌సేనానికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌లేదు. ఇక మంచు విష్ణు ప‌వ‌న్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌క‌పోవ‌డం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Visitors Are Also Reading