Home » హిందూవ్య‌తిరేకి అంటూ ర‌ష్మి పై నెటిజెన్ దారుణ‌మైన కామెంట్..దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన బ్యూటీ..!

హిందూవ్య‌తిరేకి అంటూ ర‌ష్మి పై నెటిజెన్ దారుణ‌మైన కామెంట్..దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన బ్యూటీ..!

by AJAY
Published: Last Updated on

జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ గా ర‌ష్మి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. యాంక‌ర్ గా చేయ‌కముందు ర‌ష్మి సినిమాల్లోనూ న‌టించింది. ప్ర‌స్థానం సినిమాలో కూడా ర‌ష్మి న‌టించింది. అయితే సినిమాలో చిన్న చిన్న పాత్ర‌లు చేయ‌డం వ‌ల్ల పెద్ద‌గా గుర్తింపు రాలేదు. ఇక ఎక్స్ట్రా జ‌బ‌ర్ద‌స్త్ లో ఛాన్స్ వ‌చ్చిన త‌ర‌వాత మాత్రం ఫుల్ బిజీ అయ్యింది.

ఓవైపు టీవీ షోలు చేస్తూ మ‌రోవైపు సినిమాల‌లో కూడా ఛాన్స్ లు అందుకుంది. గుంటూరు టాకీస్ సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా అనేక చిత్రాల‌లో న‌టించి మెప్పించింది. ఇక ప్ర‌స్తుతం అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ కు గుడ్ చెప్పిన‌ప్ప‌టికీ ర‌ష్మి మాత్రం యాంక‌ర్ గా కొన‌సాగుతోంది. ఇదిలా ఉండటే ర‌ష్మి సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటోంది.

Anchor Rashmi

ఇక ర‌ష్మి జంతు ప్రేమికురాలు అన్న సంగ‌తి తెలిసిందే. లాక్ డైన్ స‌మ‌యంలో ర‌ష్మి కుక్క‌ల‌కు వంట చేసి మ‌రీ ఆహారం పెట్టింది. అంతే కాకుండా జంతువుల‌ను హింసించే వారి పై సోష‌ల్ మీడియాలో ఫైర్ అవుతూ ఉంటుంది. ఇక తాజాగా ఓ భారీ వినాయ‌కుడి విగ్రహానికి గ‌జ‌రాజుతో పూలమాల వేయించారు.

 

rashmi gautham

rashmi gautham

అయితే ఈ వీడియో ను షేర్ చేసిన ర‌ష్మి గ‌జ‌రాజు పూల‌మాల వేసేట‌ప్పుడు ఎంత ఇబ్బంది పడిందో అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. కాగా దానికి ఓ నెటిజ‌న్ మీరు జంతు ప్రేమికులు కాద‌ని తెలుసు. మీరు హిందూ వ్య‌తిరేఖి అంటూ కామెంట్ పెట్టాడు. దానికి కౌంట‌ర్ ఇస్తూ ర‌ష్మి తాను నంది గోమాత‌ను చాలా పూజిస్తాన‌ని చెప్పింది. అందుకే తాను లెద‌ర్ తో చేసిన వ‌స్తువుల‌ను ఉప‌యోగించ‌న‌ని పేర్కొంది. అంతే కాకుండా తాను పాల వ‌స్తువుల‌ను కూడా ఉప‌యోగించ‌ను అంటూ తెలిపింది.

Visitors Are Also Reading