Home » ప్లాప్ అంటే తెలియని రాజమౌళి కి .. జక్కన్న నటించిన ఒక సినిమా ప్లాప్ అని మీకు తెలుసా ?

ప్లాప్ అంటే తెలియని రాజమౌళి కి .. జక్కన్న నటించిన ఒక సినిమా ప్లాప్ అని మీకు తెలుసా ?

by AJAY
Ad

టాలీవుడ్ లోనే కాకుండా ఏకంగా దేశంలో స్టార్ డైరెక్ట‌ర్ గా ఎదిగిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఇప్ప‌టి వ‌ర‌కూ జక్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వ‌లేదు అంటే ఆయ‌న స్టామినా అర్థం చేసుకోవ‌చ్చు. ద‌ర్శ‌కుడుగా రాజ‌మౌళి ఎద‌గ‌డ‌మే కాకుండా తెలుగు సినిమా స్టామినాను కూడా దేశ‌వ్యాప్తంగా టాప్ స్థానంలో నిల‌బెట్టారు. మ‌గ‌ధీర‌, ఈగ‌, బాహుబలి లాంటి సినిమాల‌తో విజువ‌ల్ వండ‌ర్స్ ను జ‌క్క‌న్న సృష్టించారు.

Advertisement

రాజ‌మౌళి సినిమా అంటే హీరో ఎవ‌ర‌నేది పట్టించుకోకుండా వెళ్లే స్థాయికి జ‌క్క‌న్న ఎదిగారు. ఇక ఇప్పుడు రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు హీరోలుగా న‌టించారు. అంతే కాకుండా బాలీవుడ్ న‌టిన‌టులు ఈ సినిమాలో న‌టించారు. ఇక ఈ చిత్రం మార్చి 25న విడుద‌ల కానుంది.

Also Read: టాలీవుడ్‌లో అత్య‌ధిక రెమ్యున‌రేషన్ తీసుకునే 10 ద‌ర్శ‌కులు ఎవరో తెలుసా 

Advertisement

prabhas rajamouli

ఇదిలా ఉంటే ద‌ర్శ‌కుడిగా తిరుగులేని రాజ‌మౌళి న‌టించిన ఓ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ గా నిలిచింది. రాజ‌మౌళి అప్పుడ‌ప్పుడు స్కీన్ పై మెరిసిన సినిమాలు చాలానే ఉన్నాయ‌న్న సంగ‌తి తెలిసిందే. త‌న ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన బాహుబ‌లి మరియు సై సినిమాల‌లో రాజ‌మౌళి చిన్న కామియో రోల్స్ లో కనిపిస్తారు.

Rajamouli about rrr logo

ఇక తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌ని సినిమాల‌లో కూడా న‌టించి అల‌రించారు. నాని హీరోగా చేసిన మ‌జ్ను సినిమాలో కూడా జక్క‌న్న క‌నిపించ‌గా ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమా తో పాటూ వీఎన్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రైన్ బో సినిమాలో కూడా రాజ‌మౌళి కనిపిస్తారు. కానీ ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ గా నిలిచింది.

Also Read: 2010 నుండి 2022 వ‌ర‌కు ఇండ‌స్ట్రీ హిట్ సినిమాలు! వాటి టోట‌ల్ క‌లెక్ష‌న్స్ లిస్ట్!! 

Visitors Are Also Reading