Home » రాహుల్ రామకృష్ణ ఓ ఇంటి వాడు కాబోతున్నాడా..!!

రాహుల్ రామకృష్ణ ఓ ఇంటి వాడు కాబోతున్నాడా..!!

Ad

తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజుల్లోనే సరికొత్త నటనతో తన హవా భావాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. ఆయన ఫేస్ చూస్తే సీరియస్ గా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎల్లప్పుడు నవ్విస్తూ గడ్డంతో కళ్ళు పెద్దవి చేస్తూ మాట్లాడే రాహుల్ రామకృష్ణ కామెడీ పంచెస్ మాత్రం అదిరిపోతాయి. అర్జున్ రెడ్డి సినిమా తో ఫేమస్ అయిన ఈ నటుడు తర్వాత అనేక ఆఫర్లతో ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అర్జున్ రెడ్డి మూవీ లో విజయ్ దేవరకొండ ఫ్రెండుగా తనని తిడుతూనే సాయం చేసే పాత్రలో సరికొత్త కామెడీ టైమింగ్ తో అందరినీ కడుపుబ్బ నవ్వించాడు. దీని తర్వాత పెళ్లి చూపులు సినిమా ఇందులో రెండు పాటలు కూడా రాశాడు. ఆయన నటనతో పాటుగా పాటలు కూడా రాసాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన జాతిరత్నాలు మూవీ లో తన క్యారెక్టర్ మాత్రం ఎంత హైలెట్ అయిదో మాటల్లో చెప్పలేం.స్టేట్ ఫార్వర్డ్ డైలాగులు చెప్పే ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆయన ఒక ఇంటివాడు కాబోతున్నట్టు తెలియజేసాడు. తన కాబోయే భార్య కు ముద్దు పెడుతూ ఫోటో దిగి షేర్ చేశాడు. త్వరలోనే వివాహం అంటూ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు జాతిరత్నం నువ్వు అంటూ అర్జున్ రెడ్డి స్టైల్ లో చెప్పావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

 

ALSO READ :

ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్ర‌ద‌ర్స్‌.. ఆక‌ట్టుకుంటున్న వీడియో

Mothers Day : త‌ల్లికి ప్రేమ‌తో శుభాకాంక్ష‌లు చెప్పిన సితార‌

 

 

Visitors Are Also Reading