Home » ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్ర‌ద‌ర్స్‌.. ఆక‌ట్టుకుంటున్న వీడియో

ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్ర‌ద‌ర్స్‌.. ఆక‌ట్టుకుంటున్న వీడియో

by Anji
Ad

ఇవాళ మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ త‌ల్లిని గుర్తు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా స్పెష‌ల్ వీడియో షేర్ చేసి ఫ్యాన్స్‌కు మంచి ఫీస్ట్ అందించారు. ఒకానొక సంద‌ర్భంలో చిరు, నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ లు వారి త‌ల్లి అంజ‌న‌మ్మతో క‌లిసి భోజ‌నం చేస్తున్న ఓ వీడియో షేర్ చేస్తూ అంద‌రికి మ‌థ‌ర్స్‌డే శుభాకాంక్ష‌లు చెప్పారు. ముగ్గురు బ్ర‌ద‌ర్స్ ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. చిరంజీవి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.


ఇక మెగా మ‌ద‌ర్ అంజ‌నాదేవి, కొణిదెల వెంక‌ట్రావు దంప‌తుల‌కు చిరంజీవి, నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటు విజ‌య‌ల‌క్ష్మి, మాధ‌వి మొత్తం ఐదుగురు సంతానం క‌ల‌రు. ముగ్గురు మొన‌గాళ్ల‌ను క‌న్న అమ్మ అంజ‌నాదేవి అంటూ మెగాఫ్యాన్స్ ఎప్పుడూ స‌ర‌దాగా చెప్పుకుంటారు. చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నాగ‌బాబు ముగ్గురు ముగ్గురే. వీరు ముగ్గురు త‌మ త‌ల్లిని ఎంతో ప్రేమ‌గానే చూసుకుంటారు. చిరంజీవి మెగాస్టార్‌గా రాణిస్తే.. చిన్న‌బ్బాయి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌వ‌ర్ స్టార్‌గా, అటు పొలిటిషియ‌న్‌గా, ఇక నాగ‌బాబు న‌టుడిగా.. నిర్మాత‌గా, వ్యాఖ్యాత‌గా త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నాడు.

Advertisement

Advertisement

మెగా బ్ర‌ద‌ర్స్ అంద‌రూ క‌లిసి త‌ల్లి అంజ‌నాదేవి పేరు మీద ఓ బ్యాన‌ర్ స్టార్ట్ చేశారు. నాగబాబు ఈ బ్యాన‌ర్‌కు నిర్మాత‌. ఈ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లో నాగ‌బాబు.. మెగా హీరోలు అయిన చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో సినిమాలు నిర్మించిన విష‌యం తెలిసిన‌దే. అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో తొలి సినిమా రుద్ర‌వీణ‌. ఈ సినిమాను అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లోనే కే.బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ఈ సినిమాకు జాతీయ అవార్డు వ‌చ్చినా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమా స‌రైన ఫ‌లితాన్ని అందుకోక‌పోవ‌డం విశేషం. ఆ త‌రువాత ఈ బ్యాన‌ర్‌లో త్రినేత్రుడు, ముగ్గురు మొన‌గాళ్లు, బావ‌గారు బాగున్నారా.!, స్టాలిన్‌, గుడుంబా శంక‌ర్‌, కౌర‌వుడు, రాధా గోపాలం, ఆరేంజ్ సినిమాలు తెర‌కెక్కాయి.

Also Read : 

ఎంసెట్‌, నీట్, జేఈఈ అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌.. వారికి ఉచిత శిక్ష‌ణ‌

ఈ రాశుల వారి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది.. వారు ఎవరంటే..!!

Visitors Are Also Reading