Home » Video Viral : నైట్ క్ల‌బ్‌లో రాహుల్ గాంధీ..!

Video Viral : నైట్ క్ల‌బ్‌లో రాహుల్ గాంధీ..!

by Anji
Ad

కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌త‌య్నాలు మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌లో కూడా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు మే 06న తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు విచ్చేయ‌నున్నార‌ని వ‌రంగ‌ల్ స‌భ‌, ఉస్మానియా యూనిర్సిటి సంద‌ర్శిస్తార‌ని స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Advertisement

ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ ఖాట్మాండ్‌లోని ఓ నైట్‌క్ల‌బ్ లో ఉన్నట్టు ఓ వీడియోలో క‌నిపించారు. ముఖ్యంగా అత‌ని చుట్టూ ఉన్న వ్య‌క్తుల‌ను చూస్తుంటే మ‌ద్యం సేవిస్తుండ‌డం.. ప‌క్క‌నే డిస్కోథెక్ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్న స‌మ‌యంలోనే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్‌కిషోర్‌ను పార్టీలో చేర్చుకునే ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైన స‌మ‌యంలో ఈ వీడియో బ‌య‌టికి రావ‌డంతో ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. రాహుల్‌గాంధీ ఖాంట్మాండ్‌లో ఉన్న త‌న స్నేహితుని వివాహానికి హాజ‌ర‌య్యాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Advertisement


నేపాల్ రాజ‌ధాని న‌గ‌రానికి రాహుల్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం చేరుకున్నారు. మ‌య‌న్మార్‌లో నేపాలి మాజీ రాయ‌బారీ భీమ్ ఉదాస్ త‌న కుమార్తె వివాహానికి హాజ‌రు కావాల్సిందిగా రాహుల్‌కు ఆహ్వానం అందింది. అయితే ఉదాస్ కుమార్తె సుమ్నిమా, మాజీ సీఎన్ఎన్ క‌ర‌స్పాండెంట్ నిమా మార్టిన్ షెర్పాతో పెళ్లి జ‌రిగింది. గ‌తంలో ఆగ‌ష్టు 2018లో రాహుల్ గాంధీ కైలాష్ మాన‌స‌రోవ‌ర్ యాత్ర‌కు వెళ్లే మార్గంలో ఖాట్మాండ్‌ను సంద‌ర్శించారు. లార్డ్ ఆఫ్ రింగ్స్ అనే నైట్‌క్ల‌బ్‌లో రాహుల్ గాంధీ వీడియోలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ వీడియోపై ఎవ‌రికి తోచిన వారు మాట్లాడుకుంటున్నారు.

Also Read : 

స‌ర్కారు వారి పాట స్టోరీ లీక్‌.. మ‌నీ విష‌యంలో మ‌హేష్ అందుకే అలా చేశాడా..?

ఆన్‌లైన్‌లో తెలంగాణ ఇంట‌ర్ హాల్ టికెట్లు.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!

Visitors Are Also Reading