Home » చిరంజీవి వల్లే నా అప్పులు తీరాయి అంటున్న రాధిక భర్త.. ఇంత సాయం చేశారా..?

చిరంజీవి వల్లే నా అప్పులు తీరాయి అంటున్న రాధిక భర్త.. ఇంత సాయం చేశారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో తన సొంత టాలెంట్ తో ఎదిగిన హీరోలలో ముందువరుసలో ఉండేది చిరంజీవి అని చెప్పవచ్చు.. ఎంత సంపాదించినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది.. అలాగే చిరంజీవి సహాయ కార్యక్రమాల్లో కూడా ముందే ఉంటారు. తను సంపాదించే సంపాదనలో ఎంతో కొంత పేద ప్రజల కోసం ఖర్చు పెడుతూనే ఉంటారు.. ఆయన చేసిన సహాయాన్ని కనీసం ఎవరితో కూడా చెప్పుకోరు. అది ఆయనతో పని చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది.. అలాగే ఆయన దగ్గర పనిచేసే వాళ్లను కూడా చిరంజీవి చాలా బాగా చూసుకుంటారని ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు రాధిక భర్త శరత్ కుమార్ తెలియజేశారు.

Advertisement

also read:హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న రోజా కూతురు.. ఆ స్టార్ హీరో వారసుడితోనేనా..?

Advertisement

ఇంకా ఆయన చిరంజీవి గురించి చాలా విషయాలు చెప్పారు.. ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన వాళ్ళలో చిరంజీవి ఒకరని చిరంజీవి పుట్టిన రోజున శరత్ కుమార్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. అయితే ఒక టైంలో నేను ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలయ్యాను. ఆ సమయంలోనే ఒక స్టార్ ప్రొడ్యూసర్ నా దగ్గరికి వచ్చి చిరంజీవితో సినిమా డేట్స్ ఇప్పిస్తే అందులో వచ్చే లాభాల్లో నీకు వాటా ఇస్తానని చెప్పారు. దీంతో నేను చిరంజీవి ఒప్పుకుంటారో లేదో అనే ఆలోచనతోనే అతన్ని కలిశాన ..కానీ చిరంజీవి అడిగిన వెంటనే ఒప్పుకున్నారు..

సినిమాకి ఒప్పుకోవడమే కాకుండా పారితోషికం కూడా తీసుకోలేదని శరత్ కుమార్ చెప్పుకొచ్చారు.. చిరంజీవి నాకు అంత మంచి స్నేహితుడు అని అన్నారు. చిరుతో కలిసి గ్యాంగ్ లీడర్ మూవీ లో చేయడం నా అదృష్టం అంటూ శరత్ కుమార్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ డబ్బులతోనే నా అప్పులు తీర్చుకున్నానని శరత్ కుమార్ చెప్పిన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:వెంకటేష్ భార్య నీరజ గార్ల పెళ్లి వెనుకున్న అసలు కథ..! భార్యని ఎందుకు బయటకి తీసుకురారంటే ?

Visitors Are Also Reading