Home » ఇంటర్ పరీక్షల్లో ఎన్టీఆర్ పై ప్రశ్నలు…సోషల్ మీడియాలో వైరల్….!

ఇంటర్ పరీక్షల్లో ఎన్టీఆర్ పై ప్రశ్నలు…సోషల్ మీడియాలో వైరల్….!

by AJAY
Ad

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో కొనసాగుతోంది. ఈ చిత్రానికి వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయి. అంతే కాకుండా మరికొన్ని కలెక్షన్ల దిశగా ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్ సన్నివేశాలు యాక్షన్ సన్నివేశాల్లో ఇద్దరూ పోటీపడి నటించారు.

Advertisement

కాగా కొమురం భీముడో పాట ఈ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఈ పాటలో ఎన్టీఆర్ నటన చింపేశారు. అదేవిధంగా సినిమాలో అజయ్ దేవగన్, శ్రీయ, ఒళివియా, అలియాభట్ సైతం తమ నటనతో మెప్పించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో సూపర్ డూపర్ హిట్ అవ్వడం తో ఇప్పటికీ జనాలు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఏకంగా పరీక్షా పత్రంలో అడగడం జరిగింది. దాంతో ప్రస్తుతం ఈ ప్రశ్న పత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ఇక ఈ ప్రశ్నపత్రం ఇంటర్ పరీక్షలకు సంబంధించినదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రశ్నాపత్రంలో “మీరు గనక రిపోర్టర్ అయితే ఎన్టీఆర్ ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు… ఆ ప్రశ్నలు రాసి వాటికి సమాధానాలు రాయండి…. అంటూ ఒక ప్రశ్నలు ఇచ్చారు.

అయితే ఇది ఇంటర్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం అని కొందరు అంటుంటే మరికొందరు ఇది పదోతరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం అని అంటున్నారు. ఏది ఏమైనా పరీక్షల్లో ఎన్టీఆర్ గురించి ప్రశ్నలు అడగటంతో ఆయన అభిమానులు ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అట్లుంటది అన్న తోటి అంటూ క్యాప్షన్ లు ఇస్తున్నారు.

Also read :

నా బ‌రువు త‌గ్గించుకుంటా నీ ముఖాన్ని ఎక్క‌డ పెట్టుకుంటావ్..? రిపోర్ట‌ర్ కు కేజీఎఫ్ న‌టి స్ట్రాంగ్ కౌంట‌ర్…!

సర్కారు వారిపాట ఫస్ట్ రివ్యూ….మాస్ ఆడియన్స్ కి పూనకాలే..!

Visitors Are Also Reading