Home » సర్కారు వారిపాట ఫస్ట్ రివ్యూ….మాస్ ఆడియన్స్ కి పూనకాలే..!

సర్కారు వారిపాట ఫస్ట్ రివ్యూ….మాస్ ఆడియన్స్ కి పూనకాలే..!

by AJAY
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా నిజానికి ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవడం వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ మహేష్ బాబు కు జోడిగా నటించింది. అదేవిధంగా గీత గోవిందం లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ ని తెరకెక్కించిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Advertisement

పరశురామ్ మొదటిసారి స్టార్ హీరోతో సినిమా చేయడంతో ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడ్డారు. కానీ సినిమా పోస్టర్ లు, ట్రైలర్ చూసిన తర్వాత అభిమానులకు సైతం సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సాదు సినిమా చూసి రివ్యూ ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా చూసిన ఉమైర్ తాజాగా తన ట్విట్టర్ లో రివ్యూ పేర్కొన్నారు.

Advertisement

ఉమైర్ తన ట్వీట్ లో సర్కారు వారి పాట మాస్ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకునే సినిమా అని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఎమోషన్, డ్రామా, కామెడీ, యాక్షన్ సమపాళ్లలో ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా వెండితెరపై మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ అద్భుతం అంటూ కొనియాడారు. ఈ సినిమా మహేష్ బాబు అభిమానులకు ఒక గొప్ప అనుభూతి అని చెప్పారు.

అంతేకాకుండా ఈ సినిమాకు తాను 4.5 రేటింగ్స్ ఇస్తున్నానని ప్రకటించారు. ఇక సినిమాకు 5 పాయింట్లకు 4.5 రేటింగ్ ఇవ్వడం అంటే సాధారణమైన విషయం కాదు. దాంతో మహేష్ బాబు అభిమానులు ట్విట్టర్ లో ఇప్పటికే సెలబ్రేషన్స్ షురూ చేశారు. మరి సినిమా విడుదల తరవాత ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో చూడాలి.

Also read :

నా బ‌రువు త‌గ్గించుకుంటా నీ ముఖాన్ని ఎక్క‌డ పెట్టుకుంటావ్..? రిపోర్ట‌ర్ కు కేజీఎఫ్ న‌టి స్ట్రాంగ్ కౌంట‌ర్…!

 

ఒకే టైటిల్ తో వచ్చిన బాలకృష్ణ, శోభన్ బాబు.. ఎవరి సినిమా హిట్ అయ్యిందో తెలుసా..?

Visitors Are Also Reading