ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టి నెల రోజులవుతున్నా.. భీకర పోరు ఆగడం లేదు. ఉక్రెయిన్ ప్రజలు లక్షలాది మంది దేశం విడిచి వెళ్లుతున్న రష్యా కనికరం చూపడం లేదు. వేలాది మంది సైనికులు, పౌరులు చనిపోతున్నా వెనక్కి తగ్గడం లేదు. ఇటు ఉక్రెయిన్ కూడా శత్రు దేశానికి గట్టిగా పోరాడుతోంది. నెల రోజు యుద్ధంలో రెండు దేశాలు కోల్పోయిందే తప్పా సాధించినది ఏమి లేదు. చివరకు రష్యా బలగాలు దాడులు ఆపి తమ దేశానికి తిరిగి వెళ్లితే.. నాటో సభ్యత్వ డిమాండ్ు వదులుకుంటాం అని జెలెన్ స్కీ ప్రకటించినప్పటికీ రష్యా మాత్రం పట్టించుకోవడం లేదు.
Also Read : ‘గని’ నుంచి “కొడ్తే” వీడియో సాంగ్.. డ్యాన్స్ అదరగొట్టిన తమన్నా..!
Advertisement
రష్యా చేస్తున్న సైనిక చర్యను ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయి. అమెరికా సహా నాటో దేశాలు పుతిన్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, యూరోపియన్ యూనియన్‌లు రష్యాపై ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొండి వైఖరీతోనే ముందుకెళ్తున్నారు. బయట ప్రపంచం నుంచే కాకుండా పుతిన్ తన సొంత దేశం నుంచి కూడా విమర్శలను మూటగట్టుకుంటున్నారు. తాజాగా పుతిన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రష్యా పర్యావరణ దౌత్యవేత్త పుతిన్ సలహాదారు అనతోలి చుబైస్ (66) తన పదవీకి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిరసిస్తూ రాజీనామా చేసిన రెండవ అత్యున్నత రష్యా అధికారి ఈయనే కావడం విశేషం.
Advertisement
అనతోలి చుబైస్‌రాజీనామా చేసినట్టు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి ధృవీకరించారు. అయితే దేశం విడిచిపెట్టి వెళ్లడం వెళ్లకపోవడం ఆయన ఇష్టమని తెలిపారు. చుబైస్ ప్రభుత్వంలో పెద్దగా ప్రభావవంతమైన వ్యక్తి ఏమి కాదు. భద్రత వ్యవహారాల్లో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ చుబైస్‌కు ఉన్న వ్యక్తిగత ప్రాముఖ్యత కారణంగా ఆయన రాజీనామా దేశంలో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సోవియట్ విచ్ఛిన్నం తరువాత 90వ దశకంలో రష్యా ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఒకరైన చుబైస్ రష్యా ప్రైవేటీకరణల రూపశిల్పిగా ప్రసిద్ధి చెందారు. అప్పటి నుంచి పుతిన్ కు మద్దతుగా నిలిచారు.
Also Read : తెలంగాణలో మరో షాక్.. విద్యుత్ ఛార్జీలు పెంపు యూనిట్‌కు ఎంతంటే..?