Home » తెలంగాణ‌లో మ‌రో షాక్‌.. విద్యుత్ ఛార్జీలు పెంపు యూనిట్‌కు ఎంతంటే..?

తెలంగాణ‌లో మ‌రో షాక్‌.. విద్యుత్ ఛార్జీలు పెంపు యూనిట్‌కు ఎంతంటే..?

by Anji
Ad

ఓవైపు నిత్య‌వ‌స‌ర ధ‌ర‌లు, మ‌రొక వైపు పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ ధ‌ర‌లు పెరిగి సామ‌న్యుడి జేబుకు చిల్లులు పెడుతున్న త‌రుణంలోనే తాజాగా క‌రెంట్ బిల్లులు కూడా దీనికి తోడ‌య్యాయి. తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత ఎన్న‌డూ లేనివిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌భుత్వం. భారీ ద్ర‌వ్య‌లోటుతో డిస్కంలు కొట్టుమిట్టాడుతుండ‌డంతో త‌ప్ప‌డం లేద‌ని స్ప‌ష్టం చేస్తోంది. పెరిగిన రేట్లు ఏప్రిల్ ఫ‌స్ట్ నుంచి అమ‌లులోకి రానున్నాయి.

Also Read :  IPL 2022 : తొలి మ్యాచ్‌లోనే ఆ రెండు టీమ్‌ల‌కు ఎదురు దెబ్బ‌. ..!

Advertisement

సామాన్యులు 50 యూనిట్ల‌లోపు క‌రెంట్ వాడితో ఇప్ప‌టిదాకా అన్ని ఛార్జీల‌తో క‌లిపి 87 రూపాయ‌ల బిల్లు వ‌చ్చేది. పెరిగిన రేట్ల‌తో మొత్తం 132 రూపాయ‌ల 41 పైస‌ల బిల్లు రానున్న‌ది. దాదాపు 40 రూపాయ‌ల బిల్లు అద‌నంగా వ‌స్తుంద‌న్న మాట. వంద యూనిట్ల‌లోపు వాడే వాళ్ల‌కు కూడా పిడుగు లాంటి వార్త ఇది. 99 యూనిట్లు వాడే వాళ్ల‌కు ఇప్ప‌టిదాకా 286 రూపాయ‌ల బిల్లు వ‌స్తే ఇప్పుడు మొత్తం 361 కి చేరుకోనుంది. అన‌గా 75 రూపాయ‌లు అద‌నంగా చెల్లించాల‌న్న మాట‌. 400 యూనిట్ల‌పైన క‌రెంట్ వాడే వినియోగ‌దారుల‌కు త‌డిసి మోపెడు కానున్న‌ది.

Advertisement

సాధార‌ణంగా వ‌చ్చే బిల్లు రూ.3,500కు మ‌రొక 200 అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే డెవ‌ల‌ఫ్‌మెంట్ ఛార్జీల‌తో జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఛార్జీల బాదుడుతో త‌ల‌లు పట్టుకుంటున్నారు. కరోనా నుంచి కోలుకుని జ‌న‌మంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో వ‌రుస బాదుడు సామాన్య జ‌నాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ఛార్జీంగ్ కేంద్రాల‌కు విద్యుత్ ఛార్జీలు పెంచాల‌ని డిస్క‌మ్‌లు ప్ర‌తిపాదించ‌గా ఈఆర్‌సీ నో చెప్పింది. కుటీర ప‌రిశ్ర‌మ‌ల‌కు, వ్య‌వ‌సాయ పంపు సెట్ల‌కు ఛార్జీఉల పెంచ‌లేదు.

Also Read :  అమ్మాయిలు ఎక్కువ‌గా ఎలాంటి అబ్బాయిల‌ను ఇష్ట‌ప‌డుతారో తెలుసా..?

Visitors Are Also Reading