Home » ‘గ‌ని’ నుంచి “కొడ్తే” వీడియో సాంగ్‌.. డ్యాన్స్ అద‌ర‌గొట్టిన త‌మ‌న్నా..!

‘గ‌ని’ నుంచి “కొడ్తే” వీడియో సాంగ్‌.. డ్యాన్స్ అద‌ర‌గొట్టిన త‌మ‌న్నా..!

by Anji
Ad

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన చిత్రం గ‌ని. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో వ‌రుణ్ స‌ర‌స‌న బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రెక‌ర్ న‌టించింది. ఈ సినిమా బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని సిద్దుముద్ద‌, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. న‌వీన్ చంద్ర‌, జ‌గ‌ప‌తిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర న‌దియా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం ఏప్రిల్ 08న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ త‌రుణంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ ను వేగ‌వంతం చేస్తోంది.

Also Read :  ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాక్…చ‌ర‌ణ్ కే ఎక్కువ మార్కులు వేసిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్…!

Advertisement

Advertisement


ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, ట్రైల‌ర్ సినిమాపై అంచెనాల‌ను భారీగానే పెంచాయి. తాజాగా కొడ్తే అంటూ సాగే స్పెష‌ల్ సాంగ్ వీడియోను విడుద‌ల చేసింది. ఇందులో త‌మ‌న్న చేసిన డ్యాన్స్‌కు అంద‌రూ ఫిదా అవుతున్నారు. రామ‌జోగయ్య శాస్త్రి రచించిన ఈ పాట‌ను హారికా నారాయ‌ణ్ పాడారు. థ‌మ‌న్ సంగీతాన్ని అందించాడు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Visitors Are Also Reading