Telugu News » వార్నీ…వేణు మాద‌వ్ డైలాగ్ ను సుకుమార్ సినిమాలో వాడుకున్నాడా…!

వార్నీ…వేణు మాద‌వ్ డైలాగ్ ను సుకుమార్ సినిమాలో వాడుకున్నాడా…!

by AJAY MADDIBOINA

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన సినిమా పుష్ఫ‌. ఈ సినిమాను గంద‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌క్కించారు. పాన్ ఇండియా లెవ‌ల్ లో ఈ సినిమాను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో సునీల్, అన‌సూయ‌, రావు రామేష్ లాంటి న‌టిన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. థియేట‌ర్ల‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన ఈ సినిమాకు వ‌సూళ్ల వ‌ర్షం కురింసింది. ఇక సినిమాకు ఓటిటిలో మంచి రెస్పాన్స్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

Ads

 

భారీ విజ‌యం సాధించిన ఈ సినిమాలోని పాటలు మరియు డైలాగులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దేశ విదేశాల క్రికెట‌ర్లు ఈ సినిమాలోని డైలాగులు పాట‌ల‌కు రీల్స్ చేస్తున్నారు. ఇక సినిమాలోని రెండు డైలాగులు ఎక్కువ‌గా పాపుల‌ర్ అవుతున్నాయి. అందులో ఒక‌టి త‌గ్గేదేలే అయితే మ‌రొక‌టి సినిమా ప్రారంభంలో అల్లు అర్జున్ ఉద్యోగం మానేసే సంధ‌ర్భంలో కాలు పై కాలు వేసుకుని చెప్పే డైలాగ్.

ఈ కాలు నాదే ఈ కాలూ నాదే…నా కాలుపై నా కాలు ఏసుకున్నా..మీ ఓన‌ర్ పై ఏమైనా ఏసిన్నా ఏంది. అయితే ఈ డైలాగ్ ను తాను త‌న బాబాయ్ చెబుతుండ‌గా విన్నాన‌ని అక్క‌డ నుండి ఇన్స్పిరేష‌న్ గా తీసుకుని సినిమాలో తీశాన‌ని సుకుమార్ చెప్పారు. కాగా తాజాగా ఈ డైలాగ్ ను ఓ పాపులర్ క‌మిడియ‌న్ ఎప్పుడో చెప్పారు. ఆ క‌మెడియ‌న్ ఎవ‌రో కాదు టాలీవుడ్ టాప్ క‌మిడియ‌న్ గా వెలుగు వెలిగిన వేణూ మాద‌వ్.

ఓ ఇంట‌ర్వ్యూలో వేణు మాద‌వ్ మాట్లాడుతూ ఓ బ‌డా హీరో నువ్వు కాలు మీద కాలు వేసుకుంటావ‌ట‌. అంటూ ప్ర‌శ్నింర‌ని తెలిపాడు. దానికి తాను నా కాలు మీద నేను కాలు వేసుకుంటాను మీకు చెప్పిన వాడి మీద ఏమైనా ఏసానా అండి వాడికేంటి స‌మ‌స్య అంటూ స‌మాధానం ఇచ్చాన‌ని చెప్పాడు.దాంతో నెటిజ‌న్లు సుక్కు వేణు మాద‌వ్ ద‌గ్గరే ఈ డైలాగ్ కాపీ కొట్టి ఉంటార‌ని కామెంట్లు పెడుతున్నారు.

also read : Lavanya tripathi : వ‌రుణ్ తేజ్ తో పెళ్లిపై స్పందించిన లావ‌ణ్య త్రిపాఠి…!


You may also like