Telugu News » Lavanya tripathi : వ‌రుణ్ తేజ్ తో పెళ్లిపై స్పందించిన లావ‌ణ్య త్రిపాఠి…!

Lavanya tripathi : వ‌రుణ్ తేజ్ తో పెళ్లిపై స్పందించిన లావ‌ణ్య త్రిపాఠి…!

by AJAY MADDIBOINA

గ‌త కొద్దిరోజులుగా మెగా హీరో వ‌రుణ్ తేజ్ తో హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి ప్రేమ‌లో ఉంది అంటూ వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా రీసెంట్ గా వ‌రుణ్ తేజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా లావ‌ణ్య త్రిపాఠి వ‌ద్దకు వెళ్లాడ‌ని ఆమెకు డైమండ్ రింగ్ ఇచ్చి ప్ర‌పోజ్ చేసాడు అంటూ కూడా వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై లావ‌ణ్య త్రిపాఠి అప్పుడు ఎలాంటి కామెంట్ చేయ‌లేదు కానీ తాను కుటుంబంతో ఉన్న‌ట్టు ఓ ఫోటో షేర్ చేసి పుకార్ల‌కు చెక్ పెట్టింది.

Ads

అయితే రీసెంట్ గా లైవ్ లోకి వ‌చ్చిన లావ‌ణ్య త్రిపాఠికి అన్నీ వ‌రుణ్ తేజ్ తో పెళ్లి అంట అంటూ ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. మీరు వ‌రుణ్ తేజ్ తో ప్రేమ‌లో ఉన్నారా..? త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబుతున్నార‌ట‌. అంటూ ర‌క‌ర‌కాలు ప్ర‌శ్న‌లు వేశారు. కాగా ఆ వార్త‌ల‌పై లావ‌ణ్య త్రిపాఠి స్పందించింది. త‌న పెళ్లి విష‌యం త‌న‌కే తెల‌య‌ద‌ని చెప్పింది. త‌న పెళ్ళి ఎవ‌రితో అనేది వేరేవాళ్ల‌కి ఎలా తెలుస్తుంది అంటూ తిరిగి ప్ర‌శ్నించింది. కానీ మీరు ఎవ‌రితో అయినా ప్రేమ‌లో ఉన్నారా అంటూ ఎదురైన ప్ర‌శ్న‌లకు మాత్రం లావ‌ణ్య త్రిపాఠి స‌మాధానం చెప్ప‌లేదు.


You may also like