Home » మెగాస్టార్‌ గాడ్ ఫాద‌ర్‌లో పూరిజ‌గ‌న్నాథ్‌.. సెట్స్‌లో పూరికి చిరంజీవి స్వాగ‌తం

మెగాస్టార్‌ గాడ్ ఫాద‌ర్‌లో పూరిజ‌గ‌న్నాథ్‌.. సెట్స్‌లో పూరికి చిరంజీవి స్వాగ‌తం

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవితో పూరి జ‌గ‌న్నాథ్ ఓ సినిమా చేస్తున్నారు. అయితే అది ద‌ర్శ‌కునిగా కాదు.. న‌టుడిగా గాడ్ ఫాద‌ర్‌లో చిరు, పూరి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

Advertisement

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాల‌నేది డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ క‌ల‌. చిరుకు రెండు, మూడు క‌థ‌లు చెప్పారు. కానీ సినిమా చేయ‌డం కుద‌ర‌లేదు. ఇన్నాళ్ల‌కు చిరుతో సినిమా చేసే అవ‌కాశం పూరి జ‌గ‌న్నాథ్‌కు ద‌క్కింది. అయితే ఆ ద‌ర్శ‌కునిగా కాదు.. న‌టుడిగా.. అవును.. చిరంజీవితో పూరి జ‌గ‌న్నాథ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

Also Read :  NTR : హాట్ టాపిక్ గా ఎన్టీఆర్ వాచ్ ధ‌ర‌…ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Advertisement

చిరంజీవి క‌థానాయ‌కుడిగా మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న సినిమా గాడ్ ఫాద‌ర్. ఇందులో పూరిజ‌గ‌న్నాథ్ ఓ ప్రత్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. పూరి జ‌గ‌న్నాథ్‌కు పుష్పగుచ్చం అందించిన మెగాస్టార్ సెట్స్‌లోకి వెల్క‌మ్ చెప్పారు.

వెండితెర‌పైన న‌టుడిగా వెలుగు వెల‌గాల‌ని న‌ర్సీప‌ట్నం నుంచి ఓ కుర్రాడు హైద‌రాబాద్ వ‌చ్చాడు. ఒక‌టి అరా వేషాలు వేశాడు. ఇందులో ఇంత‌కాలం చ‌క్రం తిప్పింది. స్టార్ డైరెక్ట‌ర్ అయ్యాడు. కానీ అత‌ని మొద‌టి క‌ల అలా మిగిలిపోకూడ‌దు క‌దా..! అందుకే నా పూరి జ‌గ‌న్నాథ్ ను ఓ ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో ప‌రిచ‌యం చేస్తున్నాను అని గాడ్ ఫాద‌ర్ సెట్స్‌లో దిగిన ఫోటోను మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

Also Read :  రూ.25 కోట్ల‌తో సువిశాల‌మైన బంగ్లా నిర్మించుకున్న ఎన్టీఆర్

Visitors Are Also Reading