Telugu News » రూ.25 కోట్ల‌తో సువిశాల‌మైన బంగ్లా నిర్మించుకున్న ఎన్టీఆర్

రూ.25 కోట్ల‌తో సువిశాల‌మైన బంగ్లా నిర్మించుకున్న ఎన్టీఆర్

by Anji

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల‌ను వసూలు చేసింది. 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో పీరియాడిక‌ల్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాలో క్యాస్ట్రింగ్ భారీగానే ఉంది.

Ads

హైద‌రాబాద్‌లోని భూస్వామ్య నిజాంలు, బ్రిటీషు రాజ్‌పై తిరుగుబాటుకు పేరుగాంచిన గోండు తెగ‌కు చెందిన విప్ల‌వ నాయ‌కుడు కొమ‌రం భీమ్ పాత్రను పోషించ‌డానికి నందమూరి తార‌క రామారావు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు రూ.45 కోట్లు చెల్లించారు. ఎన్టీఆర్ పెద్ద మొత్తంలో డ‌బ్బు సంపాదించ‌డ‌మే కాకుండా వాటిని ఖ‌ర్చు చేస్తాడు.


ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ ఖ‌రీదైన భ‌వ‌నం నిర్మించుకున్న‌ట్టు జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీహిల్స్‌లో అద్భుత‌మైన బంగ్లా కొనుగోలు చేసాడు. దాదాపు రూ.25 కోట్ల‌తో విలాస‌వంత‌మైన బంగ్లానునిర్మించుకున్న‌ట్టు తెలుస్తోంది. చాలా విలాస‌వంతంగా ఉండ‌డంతో పాటు స‌క‌ల సౌక‌ర్యాలు ఇందులో ఉంటాయ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రొక వైపు రామ్ చ‌ర‌ణ్ తేజ్ ఇటీవ‌ల నూత‌న ఇంట్లోకి అడుగు పెట్టిన విష‌యం తెలిసిన‌దే. ఆ ఇంటిని వారికి న‌చ్చిన‌ట్టుగానే చాలా ప్ర‌త్యేకంగా నిర్మించుకోవ‌డం జరిగింది. ఉపాస‌న కొణిదెల రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ కూడా నిత్యం ఆ ఇంటికి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసుకుంటున్నారు. ఎక్క‌వుగా ఉపాస‌న త‌న టేస్ట్‌కు త‌గ్గ‌ట్టుగా ఇంటి నిర్మాణం జ‌రిగే విధంగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.


ముఖ్యంగా ఇంటి కోస‌మే ఈ దంప‌తులు భారీ స్థాయిలో ఖ‌ర్చు చేసిన‌ట్టు స‌మాచారం. గ‌తంలో నిర్మించిన ఆ బంగ్లాను మ‌రొకసారి వారికి న‌చ్చిన‌ట్టుగా మార్చుకున్నారు. అందుకోసం భారీగా ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలుస్తోంది. దాదాపు మార్పుల కోసం మొత్తం రూ.5కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అయిన‌ట్టు తెలుస్తోంది. ఇక ల‌గ్జ‌రీ హోమ్ ఎలా ఉంటుందో ఊహ‌కు అంద‌డం లేదు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న త‌న 15వ సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిన‌దే.


You may also like