Home » NTR : హాట్ టాపిక్ గా ఎన్టీఆర్ వాచ్ ధ‌ర‌…ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

NTR : హాట్ టాపిక్ గా ఎన్టీఆర్ వాచ్ ధ‌ర‌…ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by AJAY
Ad

సినిమా తారలు ఎక్కడకు వెళ్ళినా ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటారు. దానికి కారణం సెలబ్రిటీలను ప్రజలు చాలా ఆసక్తిగా పరిశీలిస్తారు. వాళ్ళు వేసుకునే దుస్తులు ఒంటిపై ధరించే ఇతర వస్తువులు ఇలా అన్నింటిని ఎంతగానో పరిశీలిస్తారు. కాబట్టి సినిమా తారలు కూడా ప్రత్యేకంగా కనిపించేందుకు కాస్ట్లీ దుస్తులను బ్రాండెడ్ వాచ్ ల‌ను ఖరీదైన కార్లను వినియోగిస్తుంటారు.

Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఎంతో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. ఎన్టీఆర్ వద్ద కార్ల కలెక్షన్ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అంతే కాకుండా మార్కెట్లోకి ఖరీదైన కారు ఏది వస్తే దానిని ఎన్టీఆర్ కొనుగోలు చేస్తూ ఉంటారు. కేవలం కార్ల విషయంలోనే కాకుండా ఎన్టీఆర్ వాచ్ ల వాడకంలోనూ ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ఇక తాజాగా కూడా ఎన్టీఆర్ ఖరీదైన వాచ్ ను ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆర్ఆర్ఆర్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఆ ఖ‌రీదైన వాచ్ తో క‌నిపించారు.

Advertisement

ఎన్టీఆర్ ధరించిన వాచ్ పటెక్ పిలిప్పే నాటిలస్ 5712 1/A అనే బ్రాండ్ కు చెంద‌ని మాడ‌ల్ కాగా ఈ వాచ్ ఇంగ్లాండ్ దేశంలో త‌యారైంది. ఇక ఈ వాచ్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే. ఎంతో కాస్ట్లి గా కనిపిస్తున్న ఈ వాచ్ ధర అక్షరాలా రూ.70 లక్షల పైనే అని తెలుస్తోంది. ఇక గతంలోనూ ఎన్టీఆర్ రిచర్డ్ అనే బ్రాండ్ కు చెందిన వాచ్ ను ధరించగా ఆ వాచ్ ధ‌ర‌ ఏకంగా నాలుగు కోట్లు ఉంటుంది.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గా ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా కు పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఎన్టీఆర్ నటనకు ప్రశంసలు అందుతున్నాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమాలో అలియా భ‌ట్ హీరోయిన్ గా న‌టించ‌బోతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Visitors Are Also Reading