Home » “పోకిరి” సినిమాలోని ఆ సీన్ ను పూరీ అక్క‌డ నుండి కాపీ కొట్టాడా..? మ‌క్కికి మ‌క్కీ దించేశాడుగా..!

“పోకిరి” సినిమాలోని ఆ సీన్ ను పూరీ అక్క‌డ నుండి కాపీ కొట్టాడా..? మ‌క్కికి మ‌క్కీ దించేశాడుగా..!

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో ఒక సినిమాను ఇన్స్పిరేష‌న్ గా తీసుకుని ద‌ర్శ‌కులు క‌థ‌లు రాసుకుని సినిమాలు చేయ‌డం కామ‌న్. కానీ మ‌క్కీ టూ మ‌క్కీ సీన్లు కాపీ కొట్ట‌డ‌మే ప్రేక్ష‌కుల‌ను మోసం చేసిన‌ట్టు అవుతుంది. నిజానికి చాలా సినిమాల్లోని సీన్ల‌ను ద‌ర్శ‌కులు కాపీ కొట్టేస్తుంటారు. ఇక పోకిరి సినిమా కోసం కూడా ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాత్ ఓ సినిమా సీన్ ను మ‌క్కీ టూ మ‌క్కీ కాపీ కొట్టేశాడు. అయితే అప్ప‌ట్లో సోష‌ల్ మీడియా ప్ర‌భావం అంత‌గా లేక‌పోవ‌డంతో ఎవ‌రూ గుర్తించ‌లేదు.

Advertisement

కానీ ఇప్పుడు మాత్రం ఆ కాపీ సీన్ ను గుర్తించి సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఆ సీన్ కూడా పూరీ త‌న గురువుగారు ఆర్జీవీ సినిమా నుండే లేపేయ‌డం మ‌రో చెప్పుకోద‌గ్గ విష‌యం. పూరీ ఆర్జీవీని ఎంత‌గానో ఇష్ట‌ప‌డ‌తారు. బ్ర‌తికితే ఆర్జీవీలానే బ్ర‌త‌కాల‌ని చెబుతుంటాడు. ఆర్జీవి కూడా పూరీ సినిమా వ‌చ్చిందంటే ఆ సినిమా గురించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ప్ర‌శంస‌లు కురిపిస్తాడు. ఇక అలాంటి త‌న గురువు సినిమా నుండే పూరీ సీన్ లేపేశాడు.

Advertisement

ఆర్జీవీ ద‌ర్శ‌క‌త్వంలో కంపెనీ అనే సినిమా వ‌చ్చింది. ఈ సినిమా పోలీసులు పెట్రోలింగ్ కు వ‌చ్చిన‌ప్పుడు దొంగ త‌న‌కు తుపాకీ దొరికింద‌ని పోలీసుల‌కు ఇస్తాడు. ఈ స‌మ‌యంలో ఎక్క‌డికి వెళుతున్నావ‌ని అడిగితే సినిమాకు వెళ్లి వ‌స్తున్నా అంటూ చెబుతాడు. ఇక అదే సీన్ పోకిరి సినిమాలోనూ మ‌న‌కు క‌నిపిస్తుంది.

మ‌హేశ్ బాబు త‌న టీమ్ తో క‌లిసి సీక్రెట్ ఆప‌రేషన్ చేస్తున్న స‌మ‌యంలో పోలీసులు వ‌చ్చి ప‌ట్టుకుంటారు. దాంతో మ‌హేశ్ బాబు గ‌న్ దొరికింది మీకే ఇద్దామ‌ని తీసుకువ‌చ్చా అని చెప్తాడు. ఈ టైమ్ లో ఏం చేస్తున్నావ‌ని అడిగితే సినిమా అంటూ ముక్కుసూటిగా ఆన్స‌ర్ ఇస్తాడు. ఇక ఈ రెండు సీన్ల‌ను వైర‌ల్ చేస్తూ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

ALSO READ: “జోష్” క‌థ చ‌ర‌ణ్ కు న‌చ్చినా చిరంజీవి ఎందుకు వ‌ద్ద‌న్నారు..?

Visitors Are Also Reading