Home » టాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అవుతున్న పూరీ కూతురు…!

టాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అవుతున్న పూరీ కూతురు…!

by AJAY
Published: Last Updated on
Ad

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ సర్వసాధారణం. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు, నిర్మాతలు, దర్శకుల వారసులు ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆకాష్ వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు పూరి కూతురు పవిత్ర కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పవిత్ర పూరి ఎంట్రీ ఇచ్చేది హీరోయిన్ గానో లేదా నటిగానో కాదు. పవిత్ర పూరి నిర్మాతగా మారబోతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

పూరి జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్థ అయిన పూరి కనెక్ట్స్ లో పవిత్ర పూరి నిర్మాతగా పని చేయబోతున్నట్లు సమాచారం. పవిత్ర పూరి విదేశాల్లో చదువు పూర్తి చేసుకుంది. ఇక చిన్న వయసులో పవిత్ర బుజ్జిగాడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. అందం అభినయం కలిగిన పవిత్ర నటిగా ఎంట్రీ ఇస్తుంది అని అంతా అనుకున్నారు.

కానీ ఆమె రూటు మార్చి నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతోంది. దాంతో స్టార్ దర్శకుడి కూతురు ఇండస్ట్రీలో సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక టాలీవుడ్ లో అతి తక్కువ మంది మహిళా నిర్మాతలు ఉన్న సంగతి తెలిసిందే. మరి పవిత్ర ఆ రంగంలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading