పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరోసారి పెళ్లి చేసుకోనున్నారు. రేపు చండీగడ్‌లోని ఆయన నివాసంలో తక్కువ మంది సమక్షంలోనే వివాహం జరుననున్నది. వధవు ఫ్యామిలీ ఫ్రెండ్ అని.. చాలా సంవత్సరాల నుంచి వీరిద్ధరికీ పరిచయం ఉందని తెలుస్తోంది. ఆయనకు ఇది రెండో వివాహం కావడం గమనార్హం. ఇక పంజాబ్ సీఎం ఆరేండ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. మొదటి భార్య, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు.
Advertisement
ఇటీవల ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భగవంత్ మాన్ పిల్లలు ఇద్దరూ వచ్చారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భగవంత్ మాన్ భార్య ఇంద్రప్రీత్ కౌర్ కూడా ఆయనతో కలిసి ప్రచారం చేశారు. తాజాగా తన తల్లి, సోదరి స్వయంగా ఎంపిక చేసిన డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను భగవంత్ మాన్ పెళ్లి చేసుకోనున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు.
Punjab CM Bhagwant Mann will get married in a close private ceremony at his house in Chandigarh tomorrow with Dr Gurpreet Kaur. CM Delhi & AAP National convener Arvind Kejriwal will be in attendance. CM Mann was divorced from his earlier marriage almost 6 years back.
Advertisement
(file pic) pic.twitter.com/tC3Zd2LGfv
— ANI (@ANI) July 6, 2022
ఇక భగవంత్ మాన్ హాస్యనటుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. 2008లో కపిల్ శర్మతో కలిసి ది గ్రేట్ ఇండియన్ లాప్టర్ ఛాలెంజ్ అనే టీవీ షోలో కూడా పాల్గొన్నారు. ఆ తరువాత భగవంత్ మాన్ మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తరువాత సినిమాల్లో కూడా పని చేశారు. దాదాపు 12 సినిమాలకు పైగా నటించారు. ఆ తరువాత 2014లో మొదటిసారి సంగ్రూర్ ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో కూడా గెలిచి లోక్‌సభకు చేరుకున్నారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన నాయకత్వంలో పార్టీకి భారీ మెజార్టీ వచ్చింది. దీంతో లార్డ్మన్ మార్చి 16, 2022 పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ప్రస్తుతం పంజాబ్ సీఎం పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read :
తరుణ్, ఉదయ్ కిరణ్ కలిసి నటించాల్సిన సినిమా మధ్యలో ఎందుకు మిస్ అయ్యింది ? ఎవరు ఆపేసారు ?
ఆషాడ మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరో మీకు తెలుసా..?