Home » ఆషాడ మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయ‌రో మీకు తెలుసా..?

ఆషాడ మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయ‌రో మీకు తెలుసా..?

by Anji
Ad

ఆషాడం మాసం అంటే అంద‌రూ అశుభ‌మని అంటుంటారు. అస‌లు ఆషాడం శుభ‌కార్యాల‌కు అనువైన‌ది కాదు అని పేర్కొంటారు. కానీ పెళ్లి అయిన కొత్త పెళ్లి కూతురుని పుట్టింటికి తీసుకొచ్చేది ఆషాడ మాసంలోనే. తొలిఏకాద‌శి వ‌చ్చేది కూడా ఆషాడ మాసంలోనే. అయితే జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర కూడా ఆషాడ‌మాసంలో జ‌రుగుతుంది. గురుపౌర్ణ‌మి కూడా ఆషాడ మాసంలోనే వ‌స్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో బోనాలు కూడా ఈ మాసంలో జ‌ర‌గ‌డం విశేషం. ఆషాడం మాసం శుభ‌కార్యాల‌కు మంచిది కాక‌పోవ‌డానికి కూడా కొన్ని కార‌ణాలున్నాయి.


ప‌విత్ర మైన పూజ‌లు, వ్ర‌తాలు, ర‌థ‌యాత్ర‌లు, ప‌ల్ల‌కి సేవ‌వంటి పెద్ద పెద్ద శుభ‌కార్యాల‌కు ఇది మంచిది కాబ‌ట్టి ఆల‌యాలు భ‌క్తుల‌తో ర‌ద్దీగా ఉంటాయి. పండితులంద‌రూ పూజ‌ల్లో నిమ‌గ్నమై ఉంటారు. వారు పెళ్లి కార్య‌క్ర‌మం చేయ‌డానికి స‌మ‌యం ఉండ‌దు. అంతేకాదు ఆషాడంల సప్త ధాతువులు స‌రిగ్గా ప‌ని చేయ‌క‌పోవ‌డం, వ‌ర్షాలు కుర‌వ‌డంతో పొలం ప‌నులు అధికంగా ఉండ‌డం, ప్ర‌త్యేకంగా శూన్య‌మాసం కావ‌డంతో దీక్ష‌కు సంబంధించిన మాసం వ‌ల్ల ఆషాడంలో గ‌ర్భ‌ధార‌ణ‌కు అనుకూలమైన మాసం కాద‌ని పురాణాలు చెబుతున్నాయి. అందుకోస‌మే ఆషాడ మాసంలో పెళ్లిళ్లు చేయ‌రు. కొత్త‌గా పెళ్లి అయిన అమ్మాయి అత్త‌గారింట్లో ఉండ‌కూడ‌ద‌ని పుట్టింటికి పంపిస్తుంటారు. ఇక కొత్త‌గా పెళ్లైన భార్య‌భ‌ర్త‌లు ఆషాడ మాసంలో విడిగా ఉండ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.

Advertisement

Advertisement


ముఖ్యంగా ఆషాడ మాసంలో భార్య‌భ‌ర్త‌లు క‌లిస్తే గ‌ర్భం వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో గ‌ర్భం వ‌స్తే వేస‌విలో కాన్ఫు వ‌స్తుంది. వేస‌విలో బిడ్డ‌కు జ‌న్మినిస్తుంది. దీంతో ఎండ తీవ్ర‌త‌కు బిడ్డ‌, త‌ల్లికి అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది. అందుకే ఆషాడంలో భార్య‌ను దూరం పెడ‌తారు. అదేవిధంగా ఆషాడంలో దేవుళ్లు నిద్ర‌లోకి వెళ్తార‌ట‌. వివాహం చేసుకుంటే వారి ఆశీస్సులు ఉండ‌వ‌ట‌. ఆషాడంలో ఏ పంట చేతికి రాదు. పెళ్లి చేయ‌డానికి పైస‌లు ఉండ‌వు. దీంతో ఆషాడంలో పెళ్లిళ్లు జ‌ర‌గ‌వు అని పేర్కొంటున్నారు. ఇక ఈ మాసంలో గాలి వాన‌లు ఎక్కువ‌గా రావ‌డంతో పెళ్లిళ్ల‌కు ఆటంకాలు క‌లుగుతాయి. ఆషాడంలో అందుకే పెళ్లిళ్లు నిర్వ‌హించ‌రు.

Also Read : 

వర్షం సినిమాలోని ఈ సీన్స్ లో మనకు కనిపించిన స్టార్ డైరెక్టర్ ని గుర్తు పట్టరా ?

ఒకప్పటి సినిమాల్లో బాగా కనిపించిన మాస్టర్ భరత్ ఇప్పుడెక్కడున్నాడు ? ఏమి చేస్తున్నాడంటే ?

Visitors Are Also Reading