చాలామంది తిరుమల కి వెళ్తూ ఉంటారు. తిరుమలలో విలువైన కానుకలని సమర్పిస్తూ ఉంటారు. కానీ ఈ భక్తుడు మాత్రం తిరుమల హుండీలో చోరీ చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దొరికిపోయాడు. కోర్టు శిక్ష విధించింది. రూ. 500 అతను తీస్తే పెద్ద శిక్ష పడింది. వివరాలను చూస్తే.. ఆగస్టు 29న కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ కి చెందిన మహేష్ తిరుమల వచ్చాడు. శ్రీవారి కొత్త హుండీలో డబ్బులును దొంగలించాడు మహేష్. ఫుటేజ్ ని చూసి టిటిడి విజిలెన్స్ పోలీసులకి కంప్లైంట్ చేయగా మహేష్ ని అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement
పోలీసులు హుండీ నుండి అతను 500 తీసినట్లు గుర్తించారు. తిరుమల హుండీలో చోరీ చేసినందుకు, రెండు నెలలు జైలు శిక్ష తో పాటు వంద రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. హుండీ నుండి 500 తీస్తే 100 జరిమానాతో పాటుగా రెండు నెలల జైలు శిక్ష పడింది. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది మే నెలలో తిరుమలలోని నూతన పరకామణి మండపంలో కూడా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి మోసం చేయాలనుకున్నాడు. నోట్ల లెక్కింపు టైం లో విదేశీ కరెన్సీని తీసి బయటకు వెళ్తుంటే విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Also read:
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు
- పెళ్లి చేసుకోబోతున్న కృతిశెట్టి-వైష్ణవ్ తేజ్.. ఇది వాస్తవమేనా ?
- యాడ్స్లలో నటించడానికి ఇష్టపడని హీరోలు ఎవరో తెలుసా..?