Home » యాడ్స్‌ల‌లో న‌టించ‌డానికి ఇష్ట‌ప‌డని హీరోలు ఎవ‌రో తెలుసా..?

యాడ్స్‌ల‌లో న‌టించ‌డానికి ఇష్ట‌ప‌డని హీరోలు ఎవ‌రో తెలుసా..?

by Bunty
Ad

చాలా మంది న‌టులు సినిమాల ద్వారా వ‌చ్చిన క్రేజ్‌ను ఉప‌యోగించుకుని యాడ్స్‌ల కూడా నటిస్తుంటారు. ఆయా కంపెనీల యాడ్స్ న‌టించ‌డంతో పాటు అంబాసిట‌ర్ లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయా కంపెనీలు త‌మ ఉత్ప‌త్తులను పెంచుకోవ‌డం కోసం సినిమా ద్వారా క్రేజీ ఉన్న హీరోలతో ప‌లు ర‌కాల యాడ్స్‌ను రూపొందించుకుని మార్కెట్ చేసుకుంటుంటారు.

balakrishna rare pics

balakrishna rare pics

ఇలాంటి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు రూపొందించి అటు న‌టించినందుకు భారీగానే కంపెనీలు డ‌బ్బు అప్ప‌జెప్పుతాయి. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోలంద‌రూ యాడ్స్‌ల‌లో నటిస్తూ.. కొంత మంది ల‌బ్ధి పొందుతున్నాయి. మ‌రోవైపు కొంత‌మంది హీరోలు మాత్రం అందుకు అంగీక‌రించ‌డం లేదు. నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఇంత‌వ‌ర‌కు ఏ యాడ్‌లో కూడా న‌టించ‌లేదు. జ‌నాల‌కు ఉప‌యోగ‌ప‌డే యాడ్ ఉచితంగా చేస్తాను త‌ప్ప‌, డ‌బ్బు తీసుకొని మోసం చేయ‌న‌న్ని చెప్పారు.

Advertisement

mohanbabu images

mohanbabu images

అదేవిధంగా డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు తో యాడ్ చేసేందుకు ప‌లు కార్పొరేట్ కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ మోహ‌న్‌బాబు అందుకు ఒప్పుకోలేదు. నంద‌మూరి హీరో క‌ల్యాణ్‌రామ్ కూడా యాడ్స్ లో న‌టించే ఆఫ‌ర్ వ‌చ్చినా కూడా సున్నితంగా తిర‌స్క‌రించారు. తాను ఇలాంటి ప‌నులు తేల్చి చెప్పాడ‌ట క‌ల్యాణ్‌రామ్‌.

Advertisement

Also Read: ‘నయన్’ ను వదిలి వెళ్లిన ప్రియుడు..!

anushka shetty

anushka shetty

గౌత‌మి సౌత్‌లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన గౌత‌మికి కూడా యాడ్స్‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. అయితే డ‌బ్బులు కూడా బాగానే ఇస్తామ‌ని ఆఫ‌ర్ కూడా ఇచ్చార‌ట‌. అయినా గౌత‌మి నో చెప్పింది. ఇటీవ‌ల కాలంలో గౌత‌మి తీరులో కాస్త మార్పు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే యాడ్స్‌లో క‌నిపించే అవ‌కాశం ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా సాయిప‌ల్లవికి ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ ఈమెతో యాడ్ చేయాల‌నుకుంది. ఎన్ని కోట్లు ఇచ్చినా స‌రే తాను ఆ ప‌ని చేయ‌లేన‌ని చెప్పింది.

sai pallavi

sai pallavi

మంచు విష్ణు కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తున్నాడు. తొలి నాళ్ల‌లో యాడ్స్ కంపెనీలు ఆఫ‌ర్ ఇచ్చినా విష్ను తిర‌స్క‌రించాడు. అదేవిధంగా మ‌నోజ్ కూడా యాడ్స్‌లో న‌టించ‌డం లేదు. టాలీవుడ్ టాప్ బ్యూటీ అనుష్క‌, కామెడి స్టార్ అల్ల‌రి న‌రేష్, సాయిధ‌ర‌మ్ తేజ‌, కూడా ఆఫ‌ర్లు వ‌స్తే వ‌దులుకున్నార‌ట‌. ఇలా చాలా మంది హీరోలు యాడ్స్‌ల‌లో న‌టించాల‌ని ఆఫ‌ర్ వ‌చ్చినా కానీ.. వారు తిర‌స్క‌రించారు.

Also Read: టాలీవుడ్‌పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ

Visitors Are Also Reading