Home » గుమ్మడి గింజలతో ఒత్తైన జుట్టు… ఇలా చేస్తే చాలు.. అస్సలు జుట్టే రాలదు..!

గుమ్మడి గింజలతో ఒత్తైన జుట్టు… ఇలా చేస్తే చాలు.. అస్సలు జుట్టే రాలదు..!

by Sravya
Ad

గుమ్మడి గింజల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గింజల్ని తీసుకోవడం వలన అనేక లాభాలను పొందవచ్చు. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి తో పాటుగా ఐరన్, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గింజలతో చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. గుమ్మడి గింజలు లో రాగి, జింక్, బాస్వరం కూడా ఉంటాయి. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గింజలు మాడుని తేమగా ఉంచడానికి సహాయం చేస్తాయి. ఇన్ఫెక్షన్ నుండి కూడా రక్షించగలదు. గుమ్మడి గింజల్ని తీసుకోవడం వలన జుట్టు ఎదుగుదలకి అది ప్రోత్సహిస్తుంది.

Advertisement

జుట్టు రాలడం వంటి సమస్యలు ఉండవు. దృఢంగా మార్చగలదు. వీటిలో విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. రోజువారి ఆహారంలో ఈ గింజల్ని తీసుకోవడం వలన జుట్టు రాలడం బాగా తగ్గుతుంది. గుమ్మడి గింజల నూనె కూడా చేసుకుని వాడుకోవచ్చు. హెయిర్ మాస్క్ ని కూడా తయారు చేసుకోవచ్చు. గుమ్మడి గింజల్ని తీసుకుని తేనె, కొబ్బరి నూనె, పెరుగు సమపాళ్లలో తీసుకుని పేస్ట్ లాగ చేసుకోండి. తర్వాత దీనిని తలకి పట్టించండి. అరగంట పాటు వదిలేసి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా ఒత్తైన జుట్టుని సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also read:

Visitors Are Also Reading