Telugu News » ఎన్టీఆర్ ఆ విషయంపై స్పందించే అవకాశమే లేదట.. కారణం ఏంటంటే..?

ఎన్టీఆర్ ఆ విషయంపై స్పందించే అవకాశమే లేదట.. కారణం ఏంటంటే..?

by Anji
Ad

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా హైదరాబాద్ కు చేరుకున్నారు.  ఎన్టీఆర్ ఇప్పుడైనా చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా..  ఆ ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని అనుకుంటే ఎప్పుడో స్పందించే గతంలో  వారట. తనకు ఎదురైనా కొన్ని అనుభవాల వల్ల తారక్ చంద్రబాబు అరెస్టు విషయంలో సైలెంట్ గా ఉన్నారని అంతకుమించి చంద్రబాబు అరెస్ట్ గురించి తారక్ స్పందించకపోవడానికి ఎలాంటి కారణాలు లేవని సమాచారం.

Advertisement

రాజకీయాలకు సంబంధించిన విషయాలలో ఎన్టీఆర్ జోక్యం చేసుకునే అవకాశాలు అయితే లేవని సమాచారం అందుతుందనడం గమనార్హం. సినిమాల్లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యం అని ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం దేవర సక్సెస్ సాధించడం పై ఫోకస్ పెట్టారని సమాచారం. త్వరలో దేవర షూటింగ్ లో బిజీ కానున్న తారక్ నవంబర్ చివరి నాటికి దేవర షూటింగ్ ను పూర్తి చేసే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. 

Advertisement

జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలు సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యంగ్ టైగర్  ఎన్టీఆర్ తన సినిమాలు కమర్షియల్ గా అద్భుతాలు చేస్తూనే కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. తారక్-ప్రశాంత్ కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్  ప్రాజెక్టులలో చాలా ప్రాజెక్ట్ లకు ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ భాగస్వామిగా ఉండటం గమనార్హం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Sai Pallavi : సాయి పల్లవి కి పెళ్లి అయిపోయిందా.. ఫొటోస్ వైరల్..!

 64 ఏళ్ల వయసులో పెళ్లిచేసుకోబోతున్న జయసుధ.. మరోసారి ప్రియుడితో !!

Visitors Are Also Reading