సాధారణంగా అదృష్టం అనేది అందరినీ వరించదు. నూటిలో ఒకరిద్దరినీ మాత్రమే వరిస్తుంది అదృష్టం. మిగతా వాళ్లు తమ ప్రతిభతోనే ముందుకు నెట్టుకురావాల్సిన అవసరం ఉంటుంది. రేయింబవళ్లు కష్టపడి, తమ సత్తా చాటుకోవాల్సి ఉంటుంది. పోనీ ఈ ప్రయాణం అయినా సజావుగా ఉంటుందా ? అంటే అది కూడా లేదు. ఎన్నో అవమానాలు, చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా అయితే అమ్మాయిలు నరకం చవి చూడాల్సిందే. నరకాన్ని దాటి ఎందరో తమ కలలను సాకారం చేసుకున్నారు. తాము కోరుకున్న డ్రీమ్ ని నెరవేర్చుకున్నారు. అలాంటి వారిలో పల్సర్ బైకు ఝాన్నీ కూడా ఒకరు.
Also Read : ఆ దేశంలో ఇంగ్లీషు మాట్లాడితే ఫైన్.. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Advertisement
బస్ కండక్టర్ గా విధులు నిర్వహిస్తూనే ఎన్నో పాటలకు స్టేజ్ పై పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. పల్సర్ బైకు పాట మాత్రం ఆమె కెరీర్ ని మలుపు తిప్పేసింది. ఈ పాటకు స్టేజ్ దద్దరిల్లిపోయేవిధంగా డ్యాన్స్ చేయడంతో టీవీ షోలలో డ్యాన్స్ చేసే అవకాశాలు లభిస్తున్నాయి. మరోవైపు సినిమాల్లో కూడా మెల్లమెల్లగా అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ షోకి విచ్చేసిన ఝాన్సీ తన జీవితంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి పంచుకున్నారు.
Advertisement
Also Read : వాయిదా పడిన ఉగ్రం.. విడుదల ఎప్పుడంటే ?
. జనాలు అనుకుంటున్నట్టు తాను ఏమి ఓవర్ నైట్ స్టార్ కాలేదని, దాని వెనుక దాగి ఉన్న 18 ఏళ్ల కష్టం అని వారికి తెలియదు. ఇవాళ తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్ట, నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఓ రోజు బట్టల కోసం కొలతలు ఇవ్వడానికి టైలర్ షాప్ వద్దకు వెళ్లితే.. అక్కడ ఉన్నటువంటి ఓ టైలర్ నా పట్ల తప్పుగా ప్రవర్తించాడు. అప్పుడు చాలా కోపం వచ్చింది. ఈ విషయం తండ్రికి చెప్పి, కొట్టిద్దామనుకున్నాను. కానీ ఆయన నేను నీ తండ్రిని కాదని చెప్పమన్నాడు” అని కన్నీటి పర్వంతమైంది ఝాన్సీ. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని చాలా బాధపడింది. ప్రస్తుతం మాత్రం ఝాన్సీ లైఫ్ చాలా బిజీగానే సాగిపోతుంది.
Also Read : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరు హీరోయిన్ ! ఇప్పుడెలా ఉందొ చూసి షాకవుతున్న ఫ్యాన్స్