Home » గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరు హీరోయిన్ ! ఇప్పుడెలా ఉందొ చూసి షాకవుతున్న ఫ్యాన్స్‌

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరు హీరోయిన్ ! ఇప్పుడెలా ఉందొ చూసి షాకవుతున్న ఫ్యాన్స్‌

by AJAY
Ad

అప్ప‌ట్లో తెలుగింటి అమ్మాయిలు చాలామంది హీరోయిన్ లుగా ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అయ్యారు. స్టార్ హీరోల‌తో జోడీ క‌ట్టారు. ఆ లిస్ట్ లో హీరోయిన్ మాధవి కూడా ఉంటారు. ఈ అందాల తార విజ‌య‌శాంతి, జ‌యసుధ‌, జ‌య‌ప్ర‌ధ లాంటి స్టార్ హీరోయిన్ ల‌కు పోటీ ఇచ్చారు. అంతే కాకుండా మొదటి సినిమాతోనే ఈ భామ చిరంజీవికి జోడీగా న‌టించే అవ‌కాశాన్ని అందుకుంది. చిరంజీవి హీరోగా న‌టించిన ప్రాణం ఖ‌రీదు సినిమాతో మాధ‌వి హీరోయిన్ గా ప‌రిచ‌యమైంది.

ALSO READ :  నా బాడీ, బరువుపై ట్రోల్స్ చేస్తున్నారు-హనీ రోజ్

Advertisement

ఇక మొద‌టి సినిమాతోనే మాధ‌వి కుర్రాళ్ల ఫేవ‌రెట్ హీరోయిన్ గా మారిపోయింది. మ‌రోవైపు చిరంజీవికి సైతం ఈ హీరోయిన్ ఫేవ‌రెట్ జోడీగా మారిపోయింది. ప్రాణం ఖ‌రీదు సినిమా త‌ర‌వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌, చ‌ట్టంతో పోరాటం, మ‌ర‌ణ‌శాస‌నం, బిగ్ బాస్ ఇలా చాలా సినిమాల‌లో హీరోయిన్ గా న‌టించింది.

Advertisement

ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా న‌టించిన ఖైదీ సినిమాలో ర‌గులుతోంది మొగ‌లిపొద పాట‌లో చిరుకు పోటీగా స్టెప్పులు వేస్తూ ప్రేక్ష‌కుల‌ను అవాక్కయ్యేలా చేసింది. మ‌రోవైపు మాతృదేవోభ‌వ సినిమాలో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఈ సినిమాలో మాధ‌వి న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందాయి. తెలుగులోనే కాకుండా త‌మిళ స్టార్ హీరోలు క‌మ‌ల్ హాస‌న్, ర‌జినీకాంత్ ల‌తోనూ మాధవి సినిమాలు చేసింది.

ఇక అప్ప‌ట్లో సినిమాల‌కు గుడ్ బై చెప్పిన త‌ర‌వాత మాధ‌వి అమెరికాకు చెందిన వ్యాపార‌వేత్త మ్యాన్ రాల్ఫ్ శ‌ర్మ‌ను వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇక పెళ్లి త‌ర‌వాత అమెరికాలోనే స్థిర‌ప‌డింది. సినిమాల‌కు పూర్తిగా గుడ్ బై చెప్పిన మాధ‌వి ప్ర‌స్తుతం భ‌ర్త‌కు వ్యాపారంలో తోడుగా ఉంటోంది. ఇక ప్ర‌స్తుతం త‌న సోష‌ల్ మీడియాలో ఫోటోల‌ను షేర్ చేయ‌గా గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయింది.

ALSO READ : చిరంజీవి, వెంకటేష్, నాగార్జున “గంగోత్రి” సినిమాకి ముందుగా అనుకున్న హీరోస్ ! అల్లు అర్జున్ చేతికి ఎలా వెళ్ళింది ?

Visitors Are Also Reading