Home » ఆ దేశంలో ఇంగ్లీషు మాట్లాడితే ఫైన్.. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఆ దేశంలో ఇంగ్లీషు మాట్లాడితే ఫైన్.. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anji
Ad

సాధారణంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ఎక్కడికి వెళ్లినా ఇంగ్లీషు భాష తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా పలు సాప్ట్ వేర్ కంపెనీలతో పాటు ఇతర కంపెనీలు సైతం ఇంగ్లీషు భాషను మాట్లాడేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ ఒక  దేశంలో మాత్రం ఇంగ్లీషు భాష వాడాకాన్నే నిషేదించారు. అసలు ఏ దేశంలో ఇంగ్లీషు భాషను నిషేదించారో ఇప్పుడు మనం  తెలుసుకుందాం.  

Also Read :  24 గంటల్లో లక్షఫోన్ లు సేల్.. ఇంతకు ఆ ఫోన్ ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Advertisement

ఇటలీ దేశంలో  ఆంగ్ల భాషను వినియోగించకుండా ఓ కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ చట్టానికి మద్దతు పలికారు. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ప్రతిపాదించినటువంటి కొత్త చట్టం ప్రకారం.. అధికారిక సమాచార మార్పిడిలో ఇంగ్లీషు, ఇతర విదేశీ పదాలను ఉపయోగించడం నిషేదించారు. ఒక వేళ వినియోగించినట్టయితే.. వారికి 100,000 యూరోల (రూ.82,46,550) వరకు ఫైన్ విధించబడుతుంది. దిగువ ఛాంబర్ ఆఫ్ డిప్యూటి సభ్యుడు ఫాబియో రాంపల్లి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 

Advertisement

Also Read :  ఆవు పాలు, గేదె పాలలో ఏది ఆరోగ్యానికి మంచిది…?

Italy: ఆ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడితే ఫైన్..

ఈ చట్టం ద్వారా విదేశీ భాషలు చేర్చబడినప్పటికీ ప్రధానంగా ఆంగ్లోమానియా లేదా ఇంగ్లీషు పదాల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. ఇక ఈ ముసాయిదా ప్రధాన ఉద్దేశం ఇటాలియన్ భాష యొక్క ప్రాధాన్యాన్ని పెంచడమే అని వెల్లడించింది. ఈ బిల్లు ప్రకారం.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పదవీని కలిగి ఉన్న ఎవరైనా కూడా వ్రాతపూర్వక, మౌఖిక  జ్ఞానం, ఇటాలీయన్ భాషపై నైపుణ్యం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అధికారిక పత్రాల్లో ఇది స్థానిక వ్యాపారాలు, ఉద్యోగాల కోసం ఎక్రోనింస్ పేర్లను కూడా ఉపయోగించడాన్ని నిషేదిస్తుంది. ఈ తరుణంలో విదేశీ కంపెనీలకు అన్ని అంతర్గత విధానాలు, ఉపాధి ఒప్పందాల కోసం ఇటాలియన్ భాష వెర్షన్ అవసరం కానున్నాయి. 

Also Read :  గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరు హీరోయిన్ ! ఇప్పుడెలా ఉందొ చూసి షాకవుతున్న ఫ్యాన్స్‌

 

Visitors Are Also Reading