Home » PS 2 ఓటీటీ వేదిక ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

PS 2 ఓటీటీ వేదిక ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

by Anji
Ad

ఇటీవల కాలంలో  పాజిటివ్ లేదా నెగిటివ్ గా చాలా అంటే చాలా ట్రెండ్ అయిన మూవీ ఏదైనా ఉందంటే అది ‘పొన్నియిన్ సెల్వన్ 2’ అనే చెప్పవచ్చు. తమిళ ప్రైడ్ అనే ట్యాగ్ లైన్ తో దీనిని తాజాగా థియేటర్లలోకి తీసుకొచ్చారు. తొలిభాగం తమిళంలో తప్ప ఎక్కడా సరిగా ఆడలేదు. తెలుగు ప్రేక్షకులైతే.. దీనిని తెగ ట్రోలింగ్ చేశారు. ఎందుకంటే అంత ల్యాగ్ ఉంది మరి. ఈ క్రమంలోనే సీక్వెల్ పై ఎవరికీ అంతగా అస్సలు అంచనాల్లేవు. కానీ చాలాచోట్ల పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇక అదే సమయంలో ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్ కూడా బయటకొచ్చేశాయి. 

Also Read :  ఏన్టీఆర్ నా కాళ్లు ప‌ట్టుకుని ఏడ్చారు….హీరో త‌రుణ్ త‌ల్లి కామెంట్స్ వైర‌ల్..?

Advertisement

దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత దాదాపు అన్ని ఇండస్ట్రీల్లోనూ పీరియాడికల్ మూవీస్ ట్రెండ్ కొనసాగుతుంది. కానీ ఒక్కరు కూడా సరైన హిట్ కొట్టలేకపోయారనే చెప్పాలి.  తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఎప్పటినుంచో చెబుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాలుగా తెరకెక్కించారు. అందులో ఫస్ట్  పార్ట్ గత ఏడాది సెప్టెంబరు చివరిలో థియేటర్లలోకి వచ్చింది. దాదాపు రూ.500 కోట్ల మేర కలెక్షన్స్ సాధించిందని చెప్పారు. తాజాగా PS-2ని  విడుదల చేశారు. ఇది ఎన్ని కోట్లు సాధిస్తుందో వేచి చూడాలి. 

Advertisement

Also Read :   పసివాడి ప్రాణం మూవీలో మెగాస్టార్ తో చేసిన నటుడు.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?

Manam News

‘పొన్నియిన్ సెల్వన్’ తొలిభాగాన్ని చాలావరకు పాత్రల పరిచయానికే ఉపయోగించారు మణిరత్నం.. సీక్వెల్ లో వాటన్నింటికి సమాధానాలు చెప్పారు. డ్రామా కూడా ఎక్కువగా ఉండేవిధంగా చూసుకున్నారు. అయితే పీరియాడికల్ మూవీస్ ఇష్టపడేవారికి మాత్రమే ‘పొన్నియిన్ సెల్వన్ 2’ నచ్చుతుందని మాట్లాడుకుంటున్నారు. అయితే తొలి భాగాన్ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. సీక్వెల్ ఓటీటీ రైట్స్ ని కూడా సొంతం చేసుకుంది. సమాచారం ప్రకారం 6 వారాల తర్వాతనే స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. జూన్ ఫస్ట్ వీక్ లో పీఎస్ 2 ఓటీటీలోకి విడుదల కాబోతుందని స్పష్టమవుతోంది. 

Also Read :  ఓటీటీలోకి లారెన్స్ రుద్రడు.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే ?

Visitors Are Also Reading