Home » నేను కౌంట‌ర్ ఇస్తే ఆమె త‌ల ఎక్క‌డ పెట్టుకుంటుంది…స‌మంత పై నిర్మాత ఫైర్…!

నేను కౌంట‌ర్ ఇస్తే ఆమె త‌ల ఎక్క‌డ పెట్టుకుంటుంది…స‌మంత పై నిర్మాత ఫైర్…!

by AJAY
Ad

టాలీవుడ్ నిర్మాత న‌ట్టి కుమార్ ఈ మ‌ధ్య యూట్యూబ్ ఛానల్స్ లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. ఒక‌ప్పుడు నిర్మాత‌గా ప‌లు సినిమాలు చేసిన చిట్టిబాబు ప్ర‌స్తుతం సినిమాల‌కు రివ్యూలు ఇవ్వ‌డంతో పాటూ సెల‌బ్రెటీల‌కు సంబంధించిన విష‌యాల గురించి యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడుతుంటారు. అయితే కొద్దిరోజుల క్రితం చిట్టిబాబు స‌మంత పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం సుజిత్ ఏం చేశాడో తెలుసా ? 

Advertisement

శాకుంత‌లం సినిమా మ‌రియు య‌శోద సినిమా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో స‌మంత క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం పై ఆయ‌న షాకింగ్ కామెంట్ లు చేశారు. సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం స‌మంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. డ‌బ్బుల కోస‌మే పుష్ఫ సినిమాలో ఐట‌మ సాంగ్ కు స్టెప్పులు వేసింద‌న్నారు. అంతేకాకుండా శాకుంత‌లం సినిమాలో స‌మంత‌కు శ‌కుంతల పాత్ర ఎలా వ‌చ్చిందో అని త‌న‌కు ఆశ్చ‌ర్యం వేసింద‌న్నారు.

Advertisement

దాంతో చిట్టిబాబు కు స‌మంత సోషల్ మీడియా ద్వారా త‌న‌దైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది. కొంత‌మంది చెవుల్లో వెంట్రుక‌లు ఎలా పెరుతాయి అంటూ గూగుల్ సెర్చ్ చేసిన స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. అంతే కాకుండా గూగుల్ లో టెస్టోస్టిరాన్ హార్మోన్ పెర‌గ‌టం వ‌ల్ల‌నే అలా పెరుగుతాయ‌ని క‌నిపిస్తుంది. ఇక ఆ ఫోటోకు ఇఫ్ యూ నో యూనో అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

దాంతో అంతా ఆ కౌంట‌ర్ చిట్టిబాబుకే అంటూ కామెంట్ లు పెట్టారు. ఇక తాజాగా స‌మంత కౌంట‌ర్ పై ఓ ఇంట‌ర్వ్యూలో చిట్టిబాబు స్పందించాడు. ఆమె గురించి నేను మాట్లాడితే త‌ల ఎక్క‌డ పెట్టుకోవాలో కూడా తెలియ‌ని వ్యాక్యానించాడు. నేను కౌంట‌ర్ ఇస్తే రిప్లై ఇవ్వ‌లేదు…నా వెంట్రుక‌ల గురించి మాట్లాడే బ‌దులు నేను అడిగిన ప్ర‌శ్న‌ల్లో నిజాయితీ గురించి మాట్లాడితే బాగుండేద‌ని అన్నారు.

Visitors Are Also Reading