Home » హరి హర వీరమల్లు పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. విడుదల ఎప్పుడంటే..? 

హరి హర వీరమల్లు పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. విడుదల ఎప్పుడంటే..? 

by Anji
Ad

పవన్ కళ్యాన్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో ఆడియన్స్ లో చాలా ఎక్కువగా ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలపై దృష్టి పెడుతున్నారు. ఇటీవల విడుదలైన బ్రో మూవీ కంటే ముందే హరి హరవీరమల్లు షూటింగ్ ప్రారంభమైంది. కానీ అది ఏ ముహుర్తానా ప్రారంభం అయిందో కానీ నాలుగేళ్లుగా షూటింగ్ వాయిదా పడుతూ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది ఈ మూవీ స్టార్ అయిన తరువాతే మొదలైన వకీల్ సాబ్, భీమ్లానాయక్, బ్రో వంటీ సినిమాలు విడుదలయ్యాయి కూడా. 

Advertisement

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు మాత్రం ఇంకా విడుదలకు నోచుకోవడం లేదు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో హరిహర వీరమల్లు షూటింగ్ కాస్త వాయిదా పడింది. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు మాత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. తాజాగా హరిహరవీరమల్లు నిర్మాత ఏ.ఎం.రత్నం మూవీ షూటింగ్ పై ఓ క్లారిటీ ఇచ్చేశారు. రూల్స్ రంజన్ మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయనను ఓ విలేకరి హరి హర వీరమల్లు సినిమా వాయిదాపై ప్రశ్నించారు. దీంతో నిర్మాత ఇలా సమాధానం చెప్పాడు. 

Advertisement

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. అందులో ఆయన తక్కువ రోజుల్లో పూర్తయ్యే సినిమాకే ఓటేస్తున్నాడు. కానీ హరి హరవీరమల్లు హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మూవీ కావడంతో దాని షూటింగ్ కి ఎక్కువ సమయం కావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పవన్ రావడం చాలా కష్టం. షూటింగ్ కి గ్యాప్ ఇచ్చాం. కానీ 2023 చివరివరకు ఎలాగైనా సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తామని ఏ.ఎం.రత్నం చెప్పుకొచ్చారు. కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం హరి హర వీరమల్లు మూవీ మళ్లీ ఎలక్షన్స్ ఫలితాల తరువాతే విడుదల తేదీపై క్లారిటీ రావచ్చని పేర్కొంటున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

JAWAN FIRST REVIEW : షారుఖ్ ‘జవాన్’ ఫస్ట్ రివ్యూ .. ఎలా ఉందంటే ?

రవితేజ కూతురిని చూశారా… హీరోయిన్లను మించిన అందం.. మీరు చూశారా!

Visitors Are Also Reading