Home » JAWAN FIRST REVIEW : షారుఖ్ ‘జవాన్’ ఫస్ట్ రివ్యూ .. ఎలా ఉందంటే ?

JAWAN FIRST REVIEW : షారుఖ్ ‘జవాన్’ ఫస్ట్ రివ్యూ .. ఎలా ఉందంటే ?

by Anji
Ad

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా, నయనతార హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం జవాన్. ఈ మూవీని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో యాక్షన్ మూవీని షారుఖ్ తో ప్లాన్ చేశాడు అట్లీ. షారుఖ్ గత చిత్రం పఠాన్ మూవీ సూపర్ హిట్ సాధించడంతో ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ సాధిస్తుందనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 07న జవాన్ మూవీ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వంటి భాషల్లో గ్రాడ్ విడుదల చేయనున్నారు.

Advertisement

ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన పఠాన్ మూవీతో షారుఖ్ బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రం దాదాపు రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇప్పటివరకు దర్శకుడు అట్లీ తెరకెక్కించిన సినిమాలు అన్నీ దాదాపు సూపర్ హిట్ సాధించడంతో జవాన్ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు ప్రతీ మూవీ విడుదలకు ముందు  ఫలితం ఇదే అంటే చెప్పే ఓ ఫేక్ రివ్యూయర్ ఉమైర్ సంధు జవాన్ మూవీ చూశానని చెప్పి రివ్యూ ఇచ్చాడు. 

Advertisement

ఉమైర్ సంధు రివ్యూ ప్రకారం.. జవాన్ మూవీ షారుఖ్ టాలెంట్ మొత్తం బయటపెట్టింది. ఈ సినిమా షారుఖ్ కి కరెక్ట్ సూట్ అయిందంటే చెప్పుకొచ్చాడు. కథకు తగినట్టుగానే షారుఖ్ నటన, ఎనర్జీ పర్ ఫెక్ట్ గా సరిపోయాయట. బిజినెస్ పరంగా ఇండియన్ మూవీస్ లో భారీ కలెక్సన్లను సాధించి పాత రికార్డులను బద్దలు కొట్టేస్తుందని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా షారుఖ్ వికలాంగుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి చాలా అద్భుతంగా మెప్పించాడని వెల్లడించాడు ఉమైర్ సంధు. మరోవైపు గతంలో షారుఖ్ నటించిన హ్యాపీ న్యూ ఇయర్ మూవీకి రివ్యూ ఇచ్చి 4.5/5 రేటింగ్ ఇస్తే.. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. పఠాన్ ఫ్లాప్ అని రివ్యూ ఇస్తే.. ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. జవాన్ మూవీ సూపర్ అని చెప్పాడు. కానీ మరీ ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Chiranjeevi:  మరోసారి కలిసి నటించనున్న మెగాస్టార్- రామ్ చరణ్..!

1000 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న జగపతిబాబు…!

Visitors Are Also Reading