Home » మహిళలు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే వచ్చే ఈ సమస్యల గురించి తెలుసా ?

మహిళలు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే వచ్చే ఈ సమస్యల గురించి తెలుసా ?

by AJAY
Ad

మ‌న‌దేశంలో పురుషుల క‌నీస వివాహ వ‌య‌స్సు 21 కాగా స్త్రీల క‌నీస వ‌య‌స్సును 18 ఏళ్లుగా నిర్దారించారు. అయితే ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ స్త్రీల క‌నీస వివాహ వ‌య‌స్సు కూడా 21 ఏళ్లకు పెంచుతూ నిర్న‌యం తీసుకున్నారు. నిజానికి ప్ర‌ధాని స్త్రీల క‌నీస వివాహ వ‌య‌స్సు పెంచ‌క‌పోయినా ఇప్ప‌టికే టెక్నాల‌జీ అభివృద్ది చెంద‌డంతో పురుషులు, మ‌హిళ‌లు చాలా ఆల‌స్యంగా వివాహం చేసుకుంటున్నారు.

Advertisement

పురుషులు ముప్పై దాటిన త‌ర‌వాత‌, స్త్రీలు ముప్పైకి చేరువ‌లో ఉన్న‌ప్పుడు వివాహం కోసం తొంద‌ర‌ప‌డుతున్నారు. అప్ప‌టి వ‌ర‌కూ పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. అయితే మ‌హిళ‌లు ఆస‌ల్యంగా వివాహం చేసుకుంటే అనేక‌ర‌కాల స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైద్య నిపుణ‌లు చెబుతున్నారు. ఆల‌స్యంగా వివాహం చేసుకున్న‌ట్టు అయితే గ‌ర్భ‌వ‌తిగా ఉన్న స‌మ‌యంలో గ‌ర్భంలో పిల్ల‌ల‌ను మోసే శ‌క్తిని కోల్పోతార‌ని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడే వివాహం చేసుకుంటే పిల్ల‌లు కూడా ఆరోగ్యంగా పుడ‌తార‌ని చెబుతున్నారు.

Advertisement

మ‌హిళ‌ల‌కు వివాహం ఆల‌స్యం అయితే వారిలో వ‌చ్చే హార్మోన్ల మార్పుల వ‌ల్ల స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. కాబ‌ట్టి ఖ‌చ్చితంలో 20 ఏళ్లు దాటిన వెంట‌నే లేదంటే క‌నీసం 28 ఏళ్ల‌లోపే పిల్ల‌ల‌ను క‌న‌డం మంచిద‌ని చెప్పారు. ముప్పై ఏళ్లు దాటిన త‌ర‌వాత పిల్ల‌ల‌ను కంటే ఆ త‌ర‌వాత వ‌చ్చే శారీర‌క మార్పుల‌ను త‌ట్టుకునే శ‌క్తి కూడా ఉండ‌ద‌ని చెప్పారు.

లేటు వ‌య‌సులో పిల్ల‌ల‌ను కంటే మొటిమ‌లు రావ‌డం, ఎముక‌ల్లో నొప్పులు రావ‌డం, చెమ‌ట‌లు ప‌ట్ట‌డం లాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని అన్నారు. లేటు వ‌య‌సులో పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్ల పిల్ల‌లు కూడా పుట్ట‌క‌పోవ‌చ్చ‌ని చెప్పారు. ఆస‌ల్యంగా పిల్ల‌లు పుడితే వాళ్లు స్కూల్ ఏజ్ లో ఉన్న‌ప్పుడే త‌ల్లిదండ్రులు అనారోగ్యం భారిన ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని కాబ‌ట్టి 28 ఏళ్ల‌లోపే పిల్ల‌ల‌ను క‌నేలా మ‌హిళ‌లు వివాహం చేసుకోవాల‌ని చెబుతున్నారు.

ALSO READ :

2 రెండు రోజులు తిండి త‌ప్ప‌లు మానేసి ఏడుస్తూ కూర్చున్నా..దేవినాగ‌వ‌ల్లి ఎమోష‌న‌ల్..1

 

దేవి నాగ‌వల్లితో లొల్లి హీరోల‌కు క‌లిసివ‌స్తుందా..? నెట్టింట ట్రోల్స్..!

Visitors Are Also Reading