Telugu News » Blog » దేవి నాగ‌వల్లితో లొల్లి హీరోల‌కు క‌లిసివ‌స్తుందా..? నెట్టింట ట్రోల్స్..!

దేవి నాగ‌వల్లితో లొల్లి హీరోల‌కు క‌లిసివ‌స్తుందా..? నెట్టింట ట్రోల్స్..!

by AJAY
Ads

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ అశోక‌వ‌నంలో అర్జ‌న క‌ల్యాణం అనే సినిమాలో న‌టించారు. ఇక ఈ సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ లో వేగం పెంచాడు. ఇది వ‌ర‌కూ సినిమా ప్ర‌మోష‌న్స్ అంటే ప్రిరిలీజ్ ఈవెంట్ లు, వ‌రుస ఇంట‌ర్వ్యూలో అయితే ఇవ‌న్నీ భారీ ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. కానీ ఇప్పుడు మేక‌ర్స్ త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ ప‌బ్లిసిటీని సంపాదించే మార్గాల‌ను వెతుకున్నారు. విశ్వ‌క్ సేన్ కూడా త‌న సినిమా కోసం అదే పని చేశాడు. సినిమా రివ్యూలు చెప్పే ఓ సోష‌ల్ మీడియా స్టార్ ను తీసుకువ‌చ్చి పెట్రోల్ తో ఆత్మ‌హ‌త్య అంటూ ఓ ప్రాంక్ చేయించాడు.

అది అనుకున్న‌ట్టుగానే వైర‌ల్ అయ్యింది. సినిమాకు ఫుల్ ప‌బ్లిసిటీ వ‌చ్చింది. కాగా ఆ వీడియో పై ప్ర‌ముఖ మీడియా ఛాన‌ల్ టీవీ 9 వ‌రుస డిబేట్ లు నిర్వ‌హిస్తూ విరుచుకుప‌డింది. డిబేట్ లో యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి పాగ‌ల్ సేన్…డిప్రెసిడ్ ప‌ర్స‌న్ అంటూ వాఖ్యానించింది. దాంతో హీరో విశ్వ‌క్ సేన్ నేరుగా స్టూడియోకు వెళ్లి దేవి నాగ‌వ‌ల్లికి వార్నింగ్ ఇచ్చారు. ఎఫ్ ప‌దం వాడుతూ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అయితే గ‌తంలో కూడా దేవి నాగ‌వ‌ల్లి కొంద‌రు హీరోల‌తో చేసిన ఇంట‌ర్వ్యూలు వైర‌ల్ అయ్యాయి.

 

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో అర్జున్ రెడ్డి త‌ర‌వాత చేసిన ఓ ఇంట‌ర్వ్యూలో అర్జున్ రెడ్డిలో స్త్రీల‌ను కించ‌ప‌రిచారంటూ ప్ర‌శ్న‌లు వేయ‌డంతో రౌడీ హీరో కూడా త‌న దైన స్టైల్ లో స‌మాధానం ఇచ్చారు. ఆ త‌ర‌వాత విజ‌య్ దేవ‌ర‌కొండ గీత‌గోవిందం సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్నాడు.

రీసెంట్ సిద్దు హీరోగా వ‌చ్చిన డీజే టిల్లు సినిమా ప్ర‌మోష‌న్స్ లో కూడా ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. నేరుగా సిద్దూను మీరు ఉమెనైజ‌రా అంటూ ప్ర‌శ్నించింది. దాంతో సీరియ‌స్ అయిన హీరో అస‌లు ఉమెనైజ‌ర్ అంటూ అర్థం ఏంట‌ని ప్ర‌శ్నించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైర‌ల్ అయ్యింది. ఇక ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. మ‌రి విశ్వ‌క్ సేన్ కు దేవినాగ‌వ‌ల్లితో వివాదం కలిసివ‌స్తుందా లేదా అనేది చూడాలి.

ALSO READ :

చెల్లి దారిలోనే చందమామ…సినిమాలకు ఇక సెలవు…!

దేవి నాగవల్లి విశ్వక్ సేన్ ఇష్యూ….టాలీవుడ్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు…!


You may also like