Home » సమంతతో ఉన్న రిలేషన్ పై ప్రీతమ్ జుకాల్కర్ ఆసక్తికర కామెంట్స్..!

సమంతతో ఉన్న రిలేషన్ పై ప్రీతమ్ జుకాల్కర్ ఆసక్తికర కామెంట్స్..!

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత కాస్ట్యూమ్ డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ గురించి దాదాపు అందరికీ తెలిసిన విషయమే. చాలా సంవత్సరాల నుంచి సమంతకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు. సమంతతో పాటు రాశీఖన్నా తదితర హీరోయిన్లకు, హీరోలకు కాస్ట్యూమ్స్ చేస్తున్నారు. సమంతతో చాలా ఎక్కువగా క్లోజ్ గా ఉండేవారు. సమంతతో క్లోజ్ గా ఉండటంతో వీరి మధ్య ఏదో ఉందనే రూమర్స్ కూడా వినిపించాయి. నాగచైతన్యతో సమంత విడిపోయిన తరువాత వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో రూమర్స్ వినిపించాయి. అప్పట్లో ఈ విషయం పెద్ద దుమారాన్నే రేపింది. 

Advertisement

ఈ తరుణంలోనే సమంత, ప్రీతమ్ ఖండించారు. తాజాగా దీనిపై ప్రీతమ్ స్పందించారు. ప్రేమకి ఇచ్చిన యూట్యూబ్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను ఏంటో నాగచైతన్యకి తెలుసు అని.. వారి ఇంటికెళ్లినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకునేవారు అని, తమ మధ్య మంచి రిలేషన్ ఉందని చెప్పారు. మరోవైపు తనపై వచ్చినటువంటి రూమర్స్ పై రియాక్ట్ అవుతూ.. తెలిసిన, క్లోజ్ గా ఉన్నవారు ఎవరైనా సరే బాధలో, కష్టాల్లో ఉన్నప్పుడు వారికి మద్దతుగా నిలవడం సహజం. నేను కూడా అదే చేశాను. సమంత క్లోజ్ కావడంతో ఆమెకి సపోర్ట్ గా ఉన్నాను. అంతేకానీ.. తమ మధ్య ఏం లేదని.. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉందని చెప్పాడు ప్రీతమ్. కొందరూ తప్పు పట్టడం చాలా బాధ అనిపించిందన్నారు. తాను చాలా అగ్రెసివ్ పర్సన్ అని, తనపై ఏదైనా కామెంట్ చేస్తే తట్టుకోలేనని.. ఒక్క చెంప దెబ్బకొడితే 10 దెబ్బలు కొట్టే రకం అని చెప్పారు. తనపై కామెంట్స్ వారు ఎవ్వరని ప్రశ్నించారు. మాకు వారికి ఏం సంబంధం అని కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. 

Advertisement

అంతేకాదు.. తనపై రకరకాల కామెంట్స్ చేశారు. ప్రధానంగా తాను ‘గే’ అని కూడా ఆర్టికల్స్ రాశారు. తన గురించి తన అనుమతి లేకుండా వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆర్టికల్స్ ఎలా రాస్తారని మండిపడ్డారు  ప్రీతమ్. ఇక ఆ తరువాత అసలు విషయం తెలిసిందని..  పెయిడ్ ఆర్టికల్ అని, కొందరూ కావాలని రాయించినట్టు పేర్కొన్నాడు. లోలోపల చాలా బాధపడినట్టు వెల్లడించాడు.  తాను మాత్రం వీటిని లెక్క చేయనని.. మనం ఏదైనా మంచి చేస్తే నెగెటివ్ వస్తుందన్నారు. ఆరేడు ఏళ్లలో చాలా నేర్చుకున్నానని తెలిపారు. కాస్ట్యూమ్ డిజైనింగ్ విషయం గురించి మాట్లాడుతూ.. తాను హీరోయిన్, హీరోలకే కాదు.. పూర్తి సినిమాలకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నానని చెప్పాడు. ధమాకా, యశోద, ఓబేబీ వంటి మూవీస్ కి వర్క్ చేసినట్టు తెలిపారు. పెద్ద బ్రేక్ ఇచ్చే మూవీ కోసం ఎదురు చూస్తున్నానని.. తన డిజైన్స్ ని విస్తరించాలని అదో బ్రాండ్ తయారు చేయాలనుకుంటున్నట్టు వెల్లడించారు ప్రీతమ్. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 టాలీవుడ్ లో బట్టతల ఉన్న హీరోలు వీళ్లేనా?

ఆదిపురుష్ లో శూర్పణఖ పాత్రలో.. ఈమె రియల్ లైఫ్ లో ఎవరంటే..?

 Sai Pallavi : సాయిపల్లవి మొటిమల వెనుక అంత పెద్ద కథ ఉందా?

Visitors Are Also Reading