Home » Sai Pallavi : సాయిపల్లవి మొటిమల వెనుక అంత పెద్ద కథ ఉందా?

Sai Pallavi : సాయిపల్లవి మొటిమల వెనుక అంత పెద్ద కథ ఉందా?

by Bunty
Ad

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లు అందరిలో సాయి పల్లవి ముందు వరుసలో ఉంటారు. తన నేచురల్ అంద చందాలతో, నటనతో, డ్యాన్స్ తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఎక్స్పోజింగ్ లేకుండా చాలా ట్రెడిషనల్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ ఉంటుంది. అయితే సాయి పల్లవి ఒక టాప్ బ్రాండ్ ఫెయిర్నెస్ క్రీమ్ కోసం యాడ్ లో నటించమని అడిగితే వెంటనే నో చెప్పిందట.

Advertisement

తాను చదువుకునే సమయంలో అక్కడ ఉన్నవాళ్ళందరు చాలా అందంగా, ఫెయిర్నెస్ గా ఉంటే… సాయి పల్లవి మాత్రం పింపుల్స్ తో చాలా అందవికారంగా ఉండేదాన్ని ఫీల్ అవుతూ ఉండేదట. అయితే సాయి పల్లవి తన మొదటి సినిమా అయినటువంటి ప్రేమమ్ సినిమాలో నటించినప్పుడు కూడా తాను చాలా భయపడి పోయిందట. అందరూ హీరోయిన్స్ చాలా అందంగా ఉంటే నేను మాత్రం అలా లేనని భయంతో… ప్రేక్షకులు ఏమనుకుంటారో అని చాలా బాధపడి పోయిందట. కానీ ప్రేమమ్ సినిమా తర్వాత ప్రేక్షకుల మెప్పు పొందిన సాయి పల్లవి అందరూ నా నటనను మాత్రమే చూశారు.

Advertisement

నా ముఖాన్ని ఎవరు చూడలేదు అని… తనలో తనకి చాలా కాన్ఫిడెంట్ వచ్చిందట. ఈ అమ్మడు సినిమాల్లో కూడా ఎలాంటి మేకప్ వేసుకోకుండా చాలా నేచురల్ గా కనిపిస్తూ ఉంటుంది. తన అద్భుతమైన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ప్రేమమ్ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది సాయి పల్లవి. ఎంసీఏ, శ్యాం సింగరాయ్, విరాటపర్వం, లవ్ స్టోరీ, ఫిదా వంటి అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి :

ప్రభాస్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. దమ్ముంటే ఓమ్ రౌత్ ను కొట్టాలంటూ..!

విరూపాక్ష సినిమాలో సంయుక్త పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఓం రౌత్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారో తెలుసా ..?

Visitors Are Also Reading