Home » ఆదిపురుష్ లో శూర్పణఖ పాత్రలో.. ఈమె రియల్ లైఫ్ లో ఎవరంటే..?

ఆదిపురుష్ లో శూర్పణఖ పాత్రలో.. ఈమె రియల్ లైఫ్ లో ఎవరంటే..?

by Anji
Ad

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసిని ఆదిపురుష్ మూవీ పేరే వినిపిస్తుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన మూవీ ఆదిపురుష్. ఈ మూవీ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన తరువాత కొందరూ పాజిటివ్ అంటుంటే.. మరికొందరూ నెగిటివ్ టాక్ అని ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రామాయణంలోని పాత్రల్లో శూర్ఫణఖ పాత్ర చాలా కీలకమైనది. 

Advertisement

శూర్పణఖ అంటే.. రావణాసురుడి చెల్లెలు. ఆమె రాముడు అందం గురించి పొగుడుతుంది. తనను పెళ్లి చేసుకోమని కోరగా అందుకు రాముడు తనకు అప్పటికే పెళ్లి జరిగిందని.. ఏకపత్రీవ్రతుడనని పేర్కొంటాడు.దీంతో ఆమెకు లక్ష్మణుడిని సంప్రదించమని చెబుతాడు రాముడు. లక్ష్మణుడు తనను ఆట పట్టించాలని తాను రాముడి సేవకుడిని చెబుతాడు. తన భార్యకు బదులుగా రాముడికి రెండో భార్యగా ఉండటం మంచిదని సలహా ఇస్తాడు. ఆ మాటలకు శూర్పణఖ కోపంగా మారి సీత గురించి తప్పుగా మాట్లాడుతుంది. దీంతో లక్ష్మణుడు కోపంగా శూర్పణక ముక్కును కత్తిరిస్తాడు. ఆదిపురుష్ మూవీలో శూర్ఫణఖ నటించింది తేజస్విని పండిట్.

Advertisement

ఈ సినిమాలో చాలా క్రూరంగా కనిపించిన తేజస్విని పండిట్ రియల్ లైఫ్ లో ఓ స్టార్ హీరోయిన్. మరాఠా మూవీలో ఈమె పాపులర్ హీరోయిన్. 2004లో వచ్చిన మరాఠి చిత్రం అగాబాయి అరేచా అనే సినిమాతో కెరీర్ ని ప్రారంభించింది. ఫస్ట్ మూవీలోనే నెగిటివ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తేజస్విని పండిట్ కేవలం వెండితెరపైనే కాదు.. బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఉత్తమ నటిగా ఎన్నో ఫిల్మ్ పేర్ అవార్డులను దక్కించుకుంది. తేజస్విని తన వ్యక్తి గత జీవితంలో చాలా గ్లామరస్ పాత్రల్లో నటించింది. స్వేచ్ఛ జీవితం గడపడానికి ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల తేజస్విని పండిట్ వరుసగా వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇన్ స్టా గ్రామ్ లో కూడా చాలా యాక్టివ్ గానే ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది తేజస్విని పండిట్. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఓం రౌత్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారో తెలుసా ..?

విరూపాక్ష సినిమాలో సంయుక్త పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading