Home » Balayya : బాలయ్య సినిమాను రీమేక్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్..!

Balayya : బాలయ్య సినిమాను రీమేక్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్..!

by Sravya
Ad

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా రీమేక్ సినిమాలు చేయడానికి అస్సలు ఇష్టపడరు సినీ కెరియర్ లో నరసింహులు తప్ప మరి ఏ సినిమా కూడా రీమేక్ చేయలేదు. ఎన్టీఆర్ తన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ లెవెల్లో గుర్తింపుని తెచ్చుకున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు దేవర సినిమా మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఎన్టీఆర్ కేవలం తన సినీ కెరీర్ మొత్తం మీద నరసింహుడు తప్ప రీమేక్ సినిమాలు ఏమీ కూడా చేయలేదు.

Advertisement

నరసింహుడు సినిమాని కూడా తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేసి తెరకెక్కించారు. నిర్మాత చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా సినిమా ఫ్లాప్ అయ్యింది. కొంత కాలం పాటు మూగవాడుగా కనిపించడం కూడా నరసింహుడు సినిమా ఫ్లాప్ కి కారణమైంది. జూనియర్ ఎన్టీఆర్ స్ట్రైట్ సినిమాల్లోనే నటిస్తున్నారు. హీరో బాలయ్య నటించిన భైరవద్వీపం సినిమాని రీమేక్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు విన్న నందమూరి అభిమానులు నవ్వుకుంటున్నారు. భైరవద్వీపం దాదాపు 30 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన సినిమా.

Advertisement

అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాని చూడని సినీ అభిమానులు చాలా తక్కువ మండే ఉంటారు. ఈ సినిమాని రీమేక్ చేసిన హిట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అప్పటి ప్రేక్షకుల అభిరుచి ఇప్పటి ప్రేక్షకుల అభివృద్ధికి తేడా చాలా ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలు తో బిజీగా ఉన్నారు. ఏకంగా 5 స్ట్రైట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య మధ్య సత్సంబంధాలు లేవని ఇద్దరు మాట మధ్య మాటలు లేవని ఇండస్ట్రీలో టాక్. రీమేక్ చేయడం రూమర్ మాత్రమేనని అందరూ కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి కనుక అవకాశం ఉంటే తాత నటించిన గుండమ్మ కథ వంటి సినిమాలని రీమేక్ చేస్తారే తప్ప బాలకృష్ణ సినిమాని రీమేక్ చేయాల్సిన అవసరం తారక్ కి లేదు అని అందరూ అంటున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading