Home » త్వ‌ర‌లో వెండి తెర‌పైకి వంట‌ల‌క్క‌….!

త్వ‌ర‌లో వెండి తెర‌పైకి వంట‌ల‌క్క‌….!

by AJAY
Ad

సినిమాలైనా సీరియ‌ళ్లు అయినా పాపులారిటీ రావాలంటే అదృష్టం ఉండాల్సిందే. అదృష్టం ఉన్నవాళ్ల‌ను ఎవ‌రూ ఆప‌లేరు. అలా నక్క‌తోక తొక్కిన సీరియ‌ల్ న‌టి ప్రేమి విశ్వ‌నాథ్…తెలుగులో టాప్ సీరియ‌ల్ గా పేరు తెచ్చుకున్న కార్తీక‌దీపం సీరియ‌ల్ తో ప్రేమి విశ్వ‌నాత్ పాపుల‌ర్ అయ్యింది. ఈ సీరియ‌ల్ లో ప్రేమి విశ్వ‌నాత్ దీప క్యారెక్ట‌ర్ లో న‌టించి అల‌రిస్తోంది. ఈ సీరియ‌ల్ దీప పాత్ర‌పైనే ఎక్కువ ట్రోల్స్ రావ‌డంతో దీప‌తో పాటు సీరియ‌ల్ కు కూడా క్రేజ్ పెరిగింది. ఇక ఈ సీరియ‌ల్ లో దీప ఎమెష‌న్స్ అన్నీ భాగా పండిస్తుంద‌ని చెప్పుకుంటారు. అంతే కాదు దీప పేరు కొన్నిరోజుల త‌ర‌వాత వంట‌ల‌క్క‌గా మారిపోయింది.

premi vishwanath

premi vishwanath

సీరియ‌ల్ లో దీప పాత్ర‌ను క‌థ‌కు అనుగుణంగా కొన్నిరోజులు వంట‌ల‌క్క‌గా మార్చారు. ఇక దాంతో ఆమె పేరే వంట‌ల‌క్క‌గా మారిపోయింది. దీప‌….ప్రేమి విశ్వ‌నాథ్ అంటే గుర్తు ప‌ట్ట‌రేమోగానీ వంట‌లక్క అంటే గుర్తుప‌ట్ట‌ని ప్రేక్ష‌కులు ఉండ‌రంటే ప్రేమి విశ్వ‌నాథ్ ఈ పాత్ర ద్వారా ఎంత‌టి గుర్తింపు తెచ్చుకుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇదిలా ఉండ‌గా ప్రేమి విశ్వ‌నాథ్ ఈ రోజు పుట్టిన రోజును జ‌రుపుకుంటోంది. అయితే తెలుగు ప్రేక్ష‌కును ఎంత‌గానో అల‌రించిన ఈ అమ్మ‌డు మాత్రం తెలుగు అమ్మాయి కాదు. ప‌క్కా మ‌ల‌యాళ కుట్టి.

Advertisement

Advertisement

premi vishwanath

premi vishwanath

కానీ సీరియ‌ల్ లో అచ్చం తెలుగు అమ్మాయిలా క‌నిపించ‌డం..భారీ మేక‌ప్ న‌గ‌లు లేకుండా సింపుల్ గా ఇంటిప‌క్క‌నే ఉండే అమ్మాయిలా క‌నిపించ‌డంతో తెలుగు ప్రేక్ష‌కులు ఓన్ చేసుకున్నారు. అయితే దీప త‌నపై త‌న పాత్ర‌పై వ‌స్తున్న ట్రోల్స్ ను ఎప్పుడూ సీరియ‌స్ గా తీసుకోలేద‌ని అంతే కాకుండా వాటిని ఫ‌న్నీగా తీసుకున్నా అని అనేక సార్లు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే కార్తీక‌దీపం సీరియల్ లో త‌న పాత్ర‌కు త‌న న‌ట‌న‌కు గుర్తింపు రావ‌డంతో ఎన్నో సీరియ‌ల్ ఆఫ‌ర్లు వ‌చ్చినా ప‌క్క‌న పెట్టేసింద‌ట‌. దానికి కార‌ణం ఆమెకు సినిమా అవ‌కాశాలు రావ‌డే. త్వ‌ర‌లోనే వంట‌ల‌క్క ప‌లు చిత్రాల‌తో మందుకు రాబోతుంద‌ట‌. మ‌రి సినిమాల్లో ఏమేర‌కు అల‌రిస్తుందో చూడాలి.

also read : ఆర్మీ టూ అఖండ విల‌న్…ఈయ‌న రూటే స‌ప‌రేటు..!

Visitors Are Also Reading