Home » ఆర్మీ టూ అఖండ విల‌న్…ఈయ‌న రూటే స‌ప‌రేటు..!

ఆర్మీ టూ అఖండ విల‌న్…ఈయ‌న రూటే స‌ప‌రేటు..!

by AJAY
Ad

క‌రోనా సెకండ్ వేవ్ త‌ర‌వాత బాల‌య్య మాస్ బిర్యానీ తినిపించాడు. దాంతో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లి పోతున్నాయి. ఓ వైపు త‌మ‌న్ మ్యూజిక్ కు బాక్సులు బ‌ద్ద‌ల‌వుతుంటే మ‌రోవైపు బాల‌య్య అభిమానుల హంగామాతో థియేట‌ర్లు ఫుల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు స‌ర్వాత్రా పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డంతో క‌లెక్ష‌న్ లు కూడా జోరుగా వ‌స్తున్నాయి. ఓవ‌ర్సీస్ తో పాటు తెలుగురాష్ట్రాల్లో కూడా బాక్స్ ఆఫీస్ బ‌ద్ద‌లు కొడుతున్నాడు బాల‌య్య‌. ఇదిలా ఉంటే బాల‌య్య అఖండ సినిమాలో శ్రీకాంత్ విల‌న్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. విల‌న్ గా శ్రీకాంత్ ఎంతగానో ఆక‌ట్టుకున్నారు. ఫ‌స్ట్ టైమ్ విల‌న్ గా న‌టించిన శ్రీకాంత్ న‌ట‌నకు ప్ర‌శంస‌లు అంద‌తున్నాయి.

akhanda vialn nithin mehatha

akhanda vialn nithin mehatha

ఇదిలా ఉంటే ఇదే సినిమాలో మ‌రో విల‌న్ కూడా న‌టించిన సంగ‌తిత తెలిసిందే. ఆ న‌టుడి పేరు నితిన్ మెహ‌తా…సినిమాలో నితిన్ మెహ‌తా విల‌నిజం కూడా ఆక‌ట్టుకుంది. ఇక నితిన్ ఆహార్యం చూసి అంతా బాలీవుడ్ న‌టుడేమో అనుకున్నారు. కానీ నితిన్ బాలీవుడ్ న‌టుడు కాదు. అత‌డి బ్యాగ్రౌంగ్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. నితిన్ మెహ‌తా ఓ ఆర్మీ ఆఫీస‌ర్ 21స‌వంత్స‌రాల పాటూ నితిన్ దేశ సేవ చేశారు. అయితే ఓ యుద్దం స‌మ‌యంలో ఆయ‌న తీవ్ర‌గాయాల‌పాల‌య్యారు.

Advertisement

Advertisement

Balayya akhanda movie review

చికిత్స తీసుకున్న అనంత‌రం ఆయ‌న స్వ‌చ్చంద విర‌మ‌ణ తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న సినిమాల్లో న‌టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు బాల‌య్య‌ను ఢీ కొట్టే పాత్ర వ‌చ్చింది. బాల‌య్య మాస్ కు బోయ‌పాటి ఎప్పుడూ స‌రితూగే విల‌న్ ల‌ను సెట్ చేస్తుంటారు. లెజెండ్ లో అఖండ‌లో శ్రీకాంత్ ఈ నేప‌థ్యంలోనే మ‌రో విల‌న్ కూడా అదే రేంజ్ లో ఉండాలని నితిన్ మెహ‌తాను తీసుకున్నారు. ఇక ఆర్మీ ఆఫీస‌ర్ నుండి న‌టుడిగా మారిన నితిన్ మెహ‌తా మరిన్ని చిత్రాలు చేయాల‌ని ఆశిద్దాం..

aslo read: ధోనితో బ్రేక‌ప్ పై హాట్ బ్యూటీ ల‌క్ష్మిరాయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Visitors Are Also Reading