Home » స‌మంత పోస్ట్ కు ల‌వ్ యూ టూ అంటూ ప్రీత‌మ్ కామెంట్…ఆ పిలుపుతో రిలేష‌న్షిప్ పై క్లారిటీ..!

స‌మంత పోస్ట్ కు ల‌వ్ యూ టూ అంటూ ప్రీత‌మ్ కామెంట్…ఆ పిలుపుతో రిలేష‌న్షిప్ పై క్లారిటీ..!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించిన కాతు వాకుల రెండు కాద‌ల్ అనే సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో న‌య‌న‌తార కూడా హీరోయిన్ గా న‌టించింది. ఇక రీసెంట్ గా థియేట‌ర్ ల‌లో విడుదైన ఈ సినిమాకు మిశ్ర‌మ‌స్పంద‌న వ‌స్తోంది. ఈ చిత్రానికి న‌య‌న‌తార ప్రియుడు విగ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే తాజాగా ఈ సినిమాలో న‌టించడం అదృష్టంగా భావిస్తూ సమంత ఓ పోస్ట్ పెట్టింది.

Advertisement

త‌న పోస్ట్ లో సినిమాలో అవ‌కాశం క‌ల్పించిన విగ్నేశ్ శివ‌న్ తో పాటూ ఈ చిత్రానికి స్టైలిష్ గా ప‌నిచేసిన ప్రీత‌మ్ జుకాల్కర్ మరికొంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. కాగా ప్రీత‌మ్ పేరు ప‌క్క‌న ల‌వ్ సింబల్ జోడించింది.ఈ పోస్ట్ కు ప్రీత‌మ్ కూడా స్పందిస్తూ ల‌వ్ యూ టూ జీజీ అంటూ కామెంట్ పెట్టాడు. దాంతో ప్రీత‌మ్ కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. దానికి కార‌ణంగా స‌మంత నాగ‌చైత‌న్య విడాకుల స‌మయంలో ఇద్ద‌రూ విడిపోవ‌డానికి ప్రీత‌మ్ కార‌ణం అంటూ కొంత‌మంది చైతూ అభిమానులు ఫైర్ అయ్యారు.

Advertisement

దాంతో ప్రీత‌మ్ త‌న‌కు స‌మంత అక్క‌లాంటిది అని ఆ విష‌యం నాగ‌చైత‌న్య‌కు కూడా తెలుస‌ని అన్నాడు. కానీ త‌న‌కు బెదిరింపులు వ‌స్తున్నా నాగ‌చైత‌న్య ఆ విష‌యం బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోవ‌డం త‌న‌కు బాధ క‌లిగించింద‌ని ప్రీత‌మ్ ఆవేద‌న వ్యక్తం చేశాడు. ఇక స‌మంత విడాకుల త‌ర‌వాత కూడా ఆమెకు స్టైలిష్ గా ప్రీత‌మ్ కొన‌సాగుతున్నారు. త‌ర‌చూ స‌మంత ఫోటోల‌ను షేర్ చేస్తు ఉంటారు. స‌మంత కూడా త‌న ఫోటోల‌కు స్టైలిష్ట్ గా ప్రీత‌మ్ ను టాగ్ చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండ‌గానే టాలీవుడ్ న‌టి శ్రీరెడ్డి అప్ప‌ట్లో ప్రీత‌మ్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అయిన‌ప్ప‌టికీ కొంత‌మంది ప్రీత‌మ్ పై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రీత‌మ్ స‌మంత‌ను జీజీ అని పిలుస్తూ మ‌రోసారి త‌మ రిలేష‌న్ షిప్ పై క్లారిటీ ఇచ్చాడు. జిజి అంటే తెలుగులో అక్క అని అర్థం…మరి ఇప్ప‌టికైనా ప్రీత‌మ్ సమంత‌ల రిలేష‌న్ పై రూమ‌ర్స్ కు చెక్ ప‌డ‌తాయా లేదా అన్న‌ది చూడాలి.

ALSO READ :

విశ్వక్ సేన్-దేవి నాగవల్లి ఇష్యూ… కమెడియన్ ను పొగుడుతూ స్టార్ హీరోలను కడిగిపారేసిన బాబుగోగినేని….!

VishwekSen : “అశోకవనంలో అర్జున కళ్యాణం” రివ్యూ….! Review & Rating

Visitors Are Also Reading