Home » విశ్వక్ సేన్-దేవి నాగవల్లి ఇష్యూ… కమెడియన్ ను పొగుడుతూ స్టార్ హీరోలను కడిగిపారేసిన బాబుగోగినేని….!

విశ్వక్ సేన్-దేవి నాగవల్లి ఇష్యూ… కమెడియన్ ను పొగుడుతూ స్టార్ హీరోలను కడిగిపారేసిన బాబుగోగినేని….!

by AJAY

విశ్వక్ సేన్ దేవి నాగవల్లి మధ్య టీవీ స్టూడియో లో జరిగిన వివాదం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై పలువురు సెలబ్రెటీలు విశ్వక్ సేన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి డిబేట్ లో… పాగల్ సేన్ డిప్రెసిడ్ పర్సన్ అని పిలవడం వల్లే వల్లే విశ్వక్ అలా ప్రవర్తించాల్సి వచ్చిందని అంటున్నారు. అంతేకాకుండా గతంలో దేవి నాగవల్లి కొంత మంది హీరోలతో చేసిన ఇంటర్వ్యూల్లోనూ వేసిన ప్రశ్నలను గుర్తు చేస్తూ విమర్శిస్తున్నారు.

ఇక విశ్వక్ సేన్ కు సపోర్ట్ గా నిలిచిన వారిలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా ఒకరు. అర్జున్ రెడ్డి సినిమా తో నటుడిగా రాహుల్ రామకృష్ణ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాహుల్ రామకృష్ణ తాజాగా విశ్వక్ సేన్ కు సపోర్ట్ ఇస్తూ…. టీవీ9 దగుల్బాజీ ఛానల్, డబ్బుల కోసమే పని చేస్తుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇక రామకృష్ణ విశ్వక్ సేన్ కు సపోర్ట్ ఇవ్వడంపై బిగ్ బాస్ ఫేమ్ బాబు గోగినేని తనదైన స్టైల్ లో స్పందించారు. బాబు గోగినేని తన సోషల్ మీడియాలో రాహుల్ రామకృష్ణను ఉద్దేశించి…..హీరో దొరికేసాడు. ఒక్క హీరో కీ దమ్ము లేదు గా విస్వక్సేన్ కు అన్యాయం జరిగింది అని ఖండించడానికి! డీజే టిల్లును ఆ ఆడ లేడీ జర్నలిస్టు నువ్వు ” వుమనైజర్ వా ” అని అడిగితే సిగ్గు లేకుండా నవ్వుకున్నారా? లేదా మనల్ని కూడా అడుగుతది ఏమో అని సర్దుకు కూర్చున్నారా? ఏమన్నా అంటే మళ్ళీ పిలవరు ఏమో, పిలిచాక గెట్ ఆవుట్ అంటారేమో అని భయం కాబోసు.

RAHUL RAMAKRISHNA

RAHUL RAMAKRISHNA

మళ్ళీ మా ఎలెక్షన్ అప్పుడు స్టూడియో కు వెళ్ళాలి కదా. చానెళ్ళ లో కూర్చుని బడాయి మాటలు మాట్లాడే వీళ్ళు ఇండస్ట్రీ ని కాపాడతారట ” ఇండస్ట్రీ ని “. సినిమా టిక్కెట్ రేట్లు పెంచమని దేబురించడానికి మాత్రం ఎవర్రెడీ. బయటకి వచ్చి మాట్లాడినందుకు థాంక్స్ రాహుల్… వాళ్లకు నీతోని ఇబ్బంది అయినా నువ్వు వెల్లిపోకురా భాయి. జంగల్ ల నీ వొక్కనివే ఉన్నవు. అంటూ బాబుగోగినేని ఇండస్ట్రీ పెద్దలకు స్టార్ హీరోలకు చురకలు అంటించారు.

Also read :

VishwekSen : “అశోకవనంలో అర్జున కళ్యాణం” ట్విట్టర్ రివ్యూ….!

స్నేహరెడ్డి కంటే ముందు ఆ హీరోయిన్ ను ప్రేమించిన అల్లు అర్జున్…కానీ ఏం జ‌రిగింద‌టే..!

Visitors Are Also Reading