టాలీవుడ్ నటి ప్రగతి గురించి తెలియని వారు ఉండరు. కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అలా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వారిలో టాలీవుడ్ నటి ప్రగతి కూడా ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రగతి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సినిమాలలో హీరోలకు తల్లి, అత్త పాత్రలు చేస్తూ ప్రగతి ఫేమస్ అయ్యింది. ఎఫ్2, ఎఫ్3 సినిమాలలో ప్రగతి హీరోయిన్ తమన్నా తల్లిగా నటించి తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం నటి ప్రగతి తన కూతురుతో జీవితాన్ని గడిపేస్తుంది.
READ ALSO : Rama Banam : అదిరిన ‘రామబాణం’ ట్రైలర్.. గోపీచంద్‌కు మరో హిట్ గ్యారెంటీ..
Advertisement
కాగా, పెళ్లి చేసుకుని భర్తతో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న ప్రగతి అప్పటికే ఓ పాపకి, బాబుకి జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే భర్తతో విడిపోయిన తర్వాత కూతురు, కొడుకు జీవితాన్ని చక్కదిద్దడానికి తాను ఎంతో కష్టపడింది. అయితే తాజాగా కాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించిన ప్రగతి కాస్టింగ్ కౌచ్ పేరుతో సినిమా పరిశ్రమ మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదని చెప్పింది. సక్సెస్ సాధించిన ఏ హీరోయిన్ కూడా తనకు కాస్టింగ్ కౌచ్ అనుభవం లేదని చెబుతుందని తెలిపింది.
Advertisement
READ ALSO : ఎవరి సోనియా సింగ్ ? ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
హీరోయిన్లపై కోట్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం.. వాళ్లకి కావాల్సినంత పారితోషకం ఇవ్వడం.. కేవలం ఐదు నిమిషాల సుఖం కోసం కాదు అంటూ లాజిక్ మాట్లాడింది. ఫలానా అమ్మాయి అందుకు ఒప్పుకుంటే ఛాన్స్ ఇస్తా అంటే కుదరదు అని చెప్పింది. ఆ అమ్మాయికి ఆ రోజు సెట్ కావడం అనేది అక్కడ చాలా ముఖ్యమని చెప్పింది ప్రగతి. హీరోయిన్ల కెరీర్ ను కాస్టింగ్ కౌచ్ ప్రభావితం చేస్తుందంటే తాను నమ్మనని తెలిపింది. సక్సెస్ లేక ఫ్లాప్ అయిన హీరోయిన్లు మాత్రమే కాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావిస్తారని స్పష్టం చేసింది.
READ ALSO : Malli Pelli : ‘మళ్లీ పెళ్లి’ టీజర్ రిలీజ్….రమ్య రఘుపతిని టార్గెట్ చేశాడుగా!