Home » Prabhas-trisha:ఈ మూవీతో అలనాటి ప్రేమికులు కలవబోతున్నారా..?

Prabhas-trisha:ఈ మూవీతో అలనాటి ప్రేమికులు కలవబోతున్నారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ హీరోగా రికార్డు క్రియేట్ చేశారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా లెవెల్ లో ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.. అలాంటి హీరో కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా వర్షం.. ఈ సినిమాలో ప్రభాస్ జంటగా అందాల ముద్దుగుమ్మ త్రిష నటించింది.. వీరిద్దరి కాంబో అప్పట్లో అభిమానులను మేస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు. మొదటి సినిమాతోనే మంచి కెమిస్ట్రీ అంటూ గుర్తింపు తెచ్చుకున్న వీరు వర్షం హిట్ తర్వాత మళ్లీ రెండు సినిమాల్లో నటించారు.

Advertisement

also read:సొట్టబుగ్గలు ఉన్న అమ్మాయి ఇంటి కోడలు అయితే అత్తకు ప్రమాదం తప్పదా..?

పౌర్ణమి, బుజ్జిగాడు ఈ సినిమాల్లో కూడా వీరి కాంబో అభిమానులకు మరింత ఉత్సాహం అందించింది. దీంతో వీరి మధ్య ఏదో జరుగుతోందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యంగా వీరి మధ్య ప్రేమ ఉందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని నెట్టింట్లో న్యూస్ వైరల్ అయింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అందాల బొమ్మ త్రిష రానాను ప్రేమిస్తుందని తెలియడంతో వీరి రూమర్లకు బ్రేక్ పడింది.. ఆ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా మారిపోయారు. త్రిష కూడా దేశవ్యాప్తంగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.. ఈ తరుణంలోనే మరో వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. త్రిష మళ్లీ ప్రభాస్ తో తెరను పంచుకోబోతోందని తెలుస్తోంది.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నాడు.

Advertisement

Prabhas-Maruthi.

ఇప్పటికే మొదటి పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం అవ్వనుంది. అయితే ఈ మూవీలో ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ క్రేజీగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో త్రిష కూడా నటించబోతోందని ఒక కిక్కిచ్చే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాలో త్రిష గెస్ట్ రోల్ లో నటించబోతుందని సమాచారం. ఆమె పాత్ర నిడివి తక్కువ ఉన్న కానీ ఆమె చేసే పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం వారి పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ నెమరు వేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ సినిమా ద్వారా వీరిమధ్య మళ్ళీ ఏం చిగురిస్తుందో చూడాలి.

also read:

Visitors Are Also Reading