Home » మహానటి సావిత్రిని కడసారి చూడడానికి వాళ్ళు ఎందుకు రాలేదో తెలుసా..?

మహానటి సావిత్రిని కడసారి చూడడానికి వాళ్ళు ఎందుకు రాలేదో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహానటి సావిత్రి అంటే తెలియని వారు ఉండరు. తన ముఖ కదలికలతోనే ఏ పాత్రనైనా సింగిల్ టేకులో పూర్తిచేసే సావిత్రి అప్పట్లో ఒక సంచలమైన హీరోయిన్ గా మారింది.. ఆమె సినిమాలో హీరోయిన్ గా వచ్చింది అంటే తప్పనిసరిగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించాల్సిందే.. అంతటి క్రేజ్ సంపాదించుకుంది మహానటి సావిత్రి. అప్పట్లో ఏఎన్నార్, ఎన్టీఆర్ వంటి ఇండస్ట్రీని ఏలిన హీరోలే ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు అంటే సావిత్రి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సావిత్రి కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే జెమినీ గణేషన్ తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది.

Advertisement

also read:జక్కన్న,మహేష్ కాంబోలో మూవీ..కథ ఎలా ఉండబోతుందంటే..?

అప్పటికే జెమినీ గణేషన్ కు వివాహం కూడా అయింది. అయినా సావిత్రిని వివాహం చేసుకున్నాడు. వీరు సంసార జీవితం చక్కగానే సాగింది. ఇంతలో ఏమైందో ఏమో జెమినీ గణేషన్ పై సావిత్రికి విరక్తి పుట్టింది. అప్పటికే సావిత్రికి పిల్లలు పుట్టారు. జెమినీ గణేషన్ ని మర్చిపోలేక ఆయనతో కలిసి ఉండలేక తన సినిమా జీవితాన్ని కాకుండా ఆరోగ్యాన్ని కూడా పాడుచేసుకుంది సావిత్రి. అలాంటి సావిత్రి గురించి తన కుమార్తె చాముండేశ్వరి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.. సావిత్రి చనిపోవడానికి ముందే కుమార్తె చాముండేశ్వరి వివాహం చేసిందని ఆమె అన్నది.. సావిత్రి మంచంపై ఉన్న సమయంలో చాముండేశ్వరి డిగ్రీ పరీక్షలు రాస్తుందట..

Advertisement

ఈ తరుణంలో సావిత్రిని ఆమె కుమారుడు సతీష్ దగ్గరుండి స్కూల్ మానేసి మరీ చూసుకున్నారట.. సావిత్రిని ముందుగా గణేషన్ పట్టించుకోకపోయినా తను కోమాలోకి వెళ్లిన తర్వాత మాత్రం బాగా చూసుకున్నారని తెలియజేసింది. మా నాన్న కుటుంబంలో చాలా మంది డాక్టర్లు ఉండేవారని వారి ఇంట్లోనే అమ్మకు వైద్యం చేశారని అయినా ఉపయోగం లేదని వెల్లడించారు. అంతేకాకుండా నాన్న ఫారిన్ నుండి కూడా డాక్టర్లను రప్పించారని తెలిపింది. అమ్మ చివరి రోజుల్లో ఆమె తోటి హీరోయిన్స్ చాలామంది వచ్చి చూసి వెళ్లారని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె అంతిమ యాత్రలో కూడా చాలామంది అభిమానులు పాల్గొన్నారు అని తెలియజేసింది.. ఎంతో ఘనంగా బతికిన అమ్మను ఆ పరిస్థితుల్లో చూడడం ఇష్టం లేకే కొంతమంది కనీసం చూడటానికి రాలేదని పేర్కొంది..

also read:

Visitors Are Also Reading