Home » ప్రభాస్ సలార్ మూవీ స్టోరీ లీక్.. ఇందులో ట్విస్ట్ చూస్తే మతిపోవాల్సిందే..!

ప్రభాస్ సలార్ మూవీ స్టోరీ లీక్.. ఇందులో ట్విస్ట్ చూస్తే మతిపోవాల్సిందే..!

by Anji
Published: Last Updated on
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే తేదు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ మూవీ తరువాత దాదాపు అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియాలోనే తీస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయాయి. రూ.250 భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నాారు.ప్రభాస్ కి జంటగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కేజీఎఫ్ సిరీస్ కి పని చేసిన టీమ్ ఈ సినిమాకి కూడా పని చేస్తుందట. ఇదిలా ఉండగా.. ఇప్పటికే సలార్ సినిమాకి సంబంధించి కొన్ని లీక్ అయినట్టు సోషల్ మీడియాాాలో సందడి చేసిన విషయం విధితమే. 

Advertisement

ఈ సినిమా స్టోరీ కూడా సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ తన మిత్రుడి ఆశయాలను నెరవేర్చే పాత్రలో కనిపించబోతున్నాడట. అతడిని విలన్స్ కొన్ని కారణాల వల్ల కొట్టి చంపేస్తారాట. మరణించే ముందు ప్రభాస్ తో కొన్ని  విషయాలను చెప్పి తన ఆశయాన్ని బ్రతికించాలని కోరుతాడట. ప్రభాస్ స్నేహితుడి పాత్రలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ నటించబోతున్నాడట. ఈ సినిమాలో శృతిహాసన్-ప్రభాస్ మధ్య వచ్చేటటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయట. ఈ సినిమా క్లైమాక్స్ లో శృతిహాసన్ మరణిస్తుందని తెలుస్తోంది. 

Advertisement

ఈ సినిమా కూడా కేజీఎఫ్ సిరీస్ మాదిరిగానే ఫుల్ యాక్షన్ సీన్లను తీర్చిదిద్దే విధంగా.. ప్రతి షాట్ తరహాలో కేజీఎప్ కూడా సినిమాటిక్ యూనివర్స్ గా చేసే ఆలోచన ఉన్నట్టు చిత్ర నిర్మాతలు పేర్కొంటున్నారు.  ఈ సినిమా లింక్ ని మరొక సినిమాకి కలపడం.. అలాగే సలార్ ప్రపంచంలోని రాఖీభాయ్ కూడా అడుగుపెడుతాడట. ఈ చిత్రానికి క్లైమాక్స్ లో ట్విస్ట్ అదే. రాఖీభాయ్ కి సలార్ మూవీకి లింక్ ఏంటి అనే ట్విస్ట్ అభిమానులు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉండబోతుందట. మరీ ఈ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 తొలుత ఫ్లాప్ టాక్ సంపాదించుకొని చివరికీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మెగాస్టార్ మూవీ అదేనా..?

 కేజీఎఫ్ మూవీలో రాఖీభాయ్ పాత్రను ఆ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడా..? కారణం ఏంటంటే..?

నయనతార, ప్రభుదేవా ఆ కారణం వల్లనే విడిపోయారా..? అలా జరిగిందా..!

 

Visitors Are Also Reading